కొందరు ప్రజా ప్రతినిధులకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారు. ఎన్నికల్లో గెలిచారంటే ఇక అంతే సంగతులు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం కొంత సమయాన్నయినా కేటాయించరు. కానీ, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని తాను చేసిన గొప్ప పనితో చాటి చెప్పారు మిజోరం ఎమ్మెల్యే. చట్టసభ సభ్యుడిగా ఉన్న ఆయన అకస్మాత్తుగా డాక్టర్ అవతారమెత్తారు. ఓ మహిళకు ప్రాణం పోసి తనకు డాక్టర్ వృత్తి పట్ల ఉన్న నిబద్ధతను చాటుకున్నారు.
మిజోరంలోని సైహా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కే బేచ్చువా (52) ఇంఫాల్ ఓ శిక్షణ కార్యక్రమంలో ఉండగా సైహా జిల్లా దవాఖానలో 35 ఏళ్ల మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉందని, అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి ఉన్నదని సమాచారం అందింది. ఆయన వెంటనే వెళ్లి ఆపరేషన్ పూర్తి చేశారు. "మహిళ పేగులకు రంధ్రం ఉన్నదని, ఆమె తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నదని నాకు సమాచారం అందింది. వైద్యులు అందుబాటులో లేరని, వెంటనే ఆపరేషన్ చేయకుంటే చనిపోయే అవకాశం ఉందని చెప్పారు. అందుకే ఏమాత్రం ఆలోచించకుండా ఆపరేషన్ చేశాను. ఇప్పుడు ఆమె కోలుకుంటోంది"అని ఎమ్మెల్యే డాక్టర్ బేచ్చువా తెలిపారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్నప్పటికీ తన పనులన్నీ పక్కనబెట్టి నేరుగా హాస్పిటల్‌కు చేరుకొని స్వయంగా మహిళకు అత్యవసరంగా ఆపరేషన్ చేసి ఆమె ప్రాణాలు నిలబెట్టిన ఈ ప్రజల దృష్టిలో హీరో అయ్యారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/