మనుషులు ఉన్నప్పుడు వారి విలువ పెద్దగా తెలీదు. అందనంత దూరాలకు వెళ్లిపోయిన తర్వాత.. అయ్యో ఇలాంటి వారినా మనం మిస్ అయ్యిందన్న భావన అప్పుడప్పుడు కలుగుతుంది.కేవలం రెండు వారాల వ్యవధిలో దేశం ముగ్గురు మహోన్నత నేతల్ని కోల్పోయింది. వాజ్ పేయ్.. కరుణ.. సోమనాథ్ చటర్జీ. నిజానికి ముగ్గురు మూడు వేర్వేరు దారులు. కానీ.. వారిని కలిపే ఒకే ఒక్క అంశం.. రాజకీయాల పట్ల.. ప్రజాసేవ విషయంలో వారి నిబద్దత.
తాము నమ్మిన విలువల కోసం చివరి వరకూ తపించిన వారికి సంబంధించిన అంశాలు ఇప్పుడు సరికొత్తగా బయటకు వస్తున్నాయి. ఎవరిదాకానో ఎందుకు తన తండ్రి కరుణ గురించి కుమార్తె సెల్వి చెప్పిన మాటలు విన్నప్పుడు..కరుణ కాసింత కొత్తగా కనిపిస్తారు.
ఒక ప్రైవేటు ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆవేమంటే..
+ ఎట్టి పరిస్థితుల్లోనూ కుటుంబం విడిపోకూడదని నాన్న చెప్పారు. నాన్న ఎప్పుడూ కుటుంబంపై ఎక్కువ మమకారం చూపేవారు. కుటుంబ సభ్యులు అందరూ ఐక్యతతో ఉండాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోకూడదని నాన్న తరచూ చెప్పేవారు.
+ తమిళ అక్షరాలు ఎలా పలకాలో మునిమనవళ్లు - మునిమనవరాళ్లకు చెప్పేవారు. అందువల్లే పిల్లలందరూ తమిళంలో మంచి మార్కులు తెచ్చుకున్నారు.
+ బయటి ఊర్లలో జరిగే బహిరంగ సభలకు వెళ్లేటప్పుడు నన్ను, అమ్మను కూడా తీసుకెళ్లేవారు. సభ ముగిసిన వెంటనే ఆ సభ ఎలా జరిగిందని అడిగేవారు. దాని గురించి ఏదైనా నా అభిప్రాయాన్ని చెబితే వినేవారు. కుటుంబసభ్యుల అభిప్రాయలను ఎప్పుడూ గౌరవించేవారు.
+ సినిమా చూసేందుకు ప్రివ్యూ ప్రదర్శనలకు నాన్న తరచూ వెళ్లేవారు. అప్పుడు కుటుంబసభ్యులనూ తీసుకెళ్తారు. నేను కూడా నాన్నతో వెళ్లి సినిమా చూశాను. బయటి ఊర్లలో జరిగే సభలకు కారులో వెళ్లేటప్పుడు మాతో పాటు పార్టీ నేతలు కూడా వస్తారు. వారితో మాట్లాడుతూనే నాన్న ప్రయాణం కొనసాగిస్తారు. తనను కలిసేందుకు వచ్చే తర్వాతి శ్రేణి నేతలతో మర్యాదగా మాట్లాడాలనే విషయంలో నాన్న చాలా ఖరాకండిగా ఉంటారు.
+ ఓసారి నాన్నను చూసేందుకు నెడుంజెళియన్ ఇంటికి వచ్చారు. నేను నాన్న దగ్గరకు వెళ్లి ‘నెండుంజెళియన్ వచ్చారు’ అని చెప్పాను. వెంటనే కోపంతో తిట్టారు. ఆ విధంగా పేరుతో పిలవకూడదని ‘నావలర్’ అని మర్యాదగా పిలవాలని సూచించారు. అలాగే అన్బళగన్ నూ ‘పేరాసిరియర్’ (ప్రొఫెసర్) అని పిలవాలని సూచించారు.
+ మిగతా ఏ విషయాల్లోనూ నాన్న మమ్మల్ని తిట్టలేదు. చిన్న వయసులో చర్చ్ పార్క్ పాఠశాలలో చేర్చడానికి నన్ను - స్టాలిన్ ను తీసుకెళ్లారు. స్టాలిన్ అనే పేరుకు సీటు ఇవ్వమని పాఠశాల యంత్రాంగం చెప్పింది. ఆ విషయాన్ని నాన్నకు చెబితే.. అలాంటి పాఠశాలలో చదవాల్సిన అవసరంలేదని వేరొక చోట మమ్మల్ని చేర్చారు.
+ తమిళనాడులో పెరియార్ జన్మించిన ఈరోడు, అన్నాదురై పుట్టిన కాంచీపురం - తన సొంత నియోజకవర్గమైన తిరువారూర్ నాన్నకు బాగా నచ్చిన ఊర్లు.
+ నేను పుట్టగానే నా భర్త ఎవరనే విషయాన్ని నాన్న నిర్ణయించారు. నేను పుట్టిన వెంటనే తన అక్కకు రాసిన లేఖలో ‘సెల్వానికి సెల్వి పుట్టింది’ అని పేర్కొన్నారు. నేను పెద్దైన తర్వాత కాబోయే భర్త సెల్వమనే విషయాన్ని గ్రహించా.
+ అన్నాదురై మాతో సంభాషణలు పలికించేవారు. అళగిరి అన్న బాగా డైలాగులు చెప్పేవారు.
+ అమ్మ చేసే చేపలకూర అంటే నాన్నకు బాగా ఇష్టం. కొన్నేళ్లుగా నాన్నకు అన్నం తినిపించాను. అప్పుడు ‘బాగా తినిపిస్తున్నావమ్మా’ అని చెప్పారు. ఇతర పార్టీల నేతలు తనను కలిసేందుకు ఇంటికి వస్తే వారికి నచ్చిన వంటకాలు సిద్ధం చేయమని పురమాయిస్తారు.
+ ఓ సారి ఇందిరాగాంధీని చూసేందుకు దిల్లీ వెళ్లినప్పుడు మమ్మల్ని తీసుకెళ్లారు. ఆమెతో కూర్చొని భోజనం చేసిన ఘటనను మర్చిపోలేం. నాన్నకు ఎప్పుడూ పంచె - ధోవతి ధరించడమే ఇష్టం. ఒకసారి మాత్రం ప్యాంట్ ధరించారేమో. నాన్న మృతిని శూన్యంగానే భావిస్తా.