స్టాలిన్ స‌వాల్ ను ఐటీ అధికారులు స్వీక‌రిస్తారా?

Update: 2019-04-05 08:50 GMT
దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న ఎన్నిక‌లు ఒక ఎత్తు అయితే.. కొన్ని రాష్ట్రాల్లో కొంత‌మంది నేత‌ల‌పై జ‌రుగుతున్న సోదాలు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారుతున్నాయి. కీల‌క‌మైన పోలింగ్ కు కాస్త ముందుగా.. ఐటీ..ఈడీ.. పోలీసు అధికారులు పెద్ద ఎత్తున త‌నిఖీలు చేయ‌టం హాట్ టాపిక్ గా మారింది.

ప్ర‌ధాని మోడీతో దోస్తానా క‌టీఫ్ అయిన నాటి నుంచి ఏపీ హాట్ చిక్ గా క‌నిపించ‌ని ప‌రిస్థితి. ఏ శాఖ‌కు సంబంధించిన అధికారులు ఎప్పుడు ఏ నేత ఇంటికి వెళ‌తారో అర్థం కాని ప‌రిస్థిత‌. తాజాగా  చూస్తే.. ఏపీ సీఎం చంద్ర‌బాబుకు స‌న్నిహితుడైన సీఎం ర‌మేశ్ మొద‌లుకొని ప‌లువురు ఆస్తుల‌కు సంబంధించిన లెక్క‌ల గుట్టు తేల్చేందుకు ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు.

మోడీతో పెట్టుకుంటే ఇలాంటివి జ‌ర‌గొచ్చ‌న్న ప్లాన్ లో ఉన్న చంద్ర‌బాబు.. ఎంత ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకున్నా.. అనుకోని షాకులు ఎదుర‌వుతూ ఉన్నాయి.  ఐటీ.. ఈడీ శాఖ‌కు చెందిన అధికారులు దేశ వ్యాప్తంగా కొన్ని ఎంపిక చేసిన నేత‌ల ఇళ్ల‌ల్లో సోదాలు నిర్వ‌హిస్తున్నారు. తాజాగా త‌మిళ‌నాడులోని డీఎంకే అధినేత స్టాలిన్ చెల‌రేగిపోయారు. వాళ్లు.. వీళ్లు అన్న తేడా  లేకుండా త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై కేంద్ర నిఘా సంస్థ‌ల్ని..ఐటీని వాడేస్తున్నట్లుగా వెల్ల‌డించారు. అంతేకా.. ప్ర‌ధాని మోడీకి ద‌మ్ముంటే.. ఆయ‌నింట్లో సోదాలు చేప‌ట్టాల‌ని స‌వాలు విసిరారు.

ఐటీ శాఖ‌కు ధైర్యం ఉంటే ప్ర‌ధాని మోడీ నివాసంలో సోదాలు నిర్వ‌హించ‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నించారు. కోట్లాది రూపాయిల డ‌బ్బును ప్ర‌ధాని మోడీ ఇంట్లో దాచి పెట్టార‌ని స్టాలిన్ ఆరోపించారు.అంతేకాదు.. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి. . ఉప ముఖ్య‌మంత్రి ప‌న్నీరు సెల్వం నివాసాల్లో త‌నిఖీలు చేయాల‌ని ఆదేశాలు జారీ చేస్తారా? అని స‌వాల్ విసిరారు. థేని ఎంపీ స్థానానికి ప‌న్నీరు సెల్వం కుమారుడు పోటీ ప‌డుతున్నారు. దీంతో.. త‌మిళ‌నాడులో రాజ‌కీయం మ‌రింత వేడెక్కిందని చెప్పాలి.

అధికార అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోవ‌టం.. డీఎంకే అభ్య‌ర్థులు బ‌లంగా ఉన్న వాద‌న వినిపిస్తోంది. ఇలాంటి వేళ‌లో విప‌క్ష అభ్య‌ర్థుల ఇళ్ల‌ల్లో ఐటీ సోదాలు చేయ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. మోడీకి వ్య‌తిరేకంగా ఉన్న పార్టీ నేత‌లపై కొన్ని శాఖ‌లు అదే ప‌నిగా సోదాలు చేయ‌టంపై అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌పై  జ‌రుగుతున్న సోదాల నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీపై స్టాలిన్ తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌టం గ‌మ‌నార్హం. 
Tags:    

Similar News