సినిమాలోని ‘నెల్లూరు పెద్దా రెడ్లు’ డైలాగ్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాయలసీమలోనే కాదు.. నెల్లూరులో రెడ్డి సామాజకవర్గం జనాభా ఎక్కువే. అక్కడ వారి ఆధిపత్యం కొన్ని దశాబ్ధాలుగా సాగుతోంది. నెల్లూరు రెడ్లు అంటే ఇండియా లెవల్లో ఫేమస్. ఇండియాలో ఉన్న అన్ని రంగాల్లో వారి పెట్టుబడి ఉంటుంది. బిజినెస్ లో వారిది అందెవేసిన చేయి.
గడిచిన ప్రభుత్వాల్లో ఆనం రామనారాయణరెడ్డి బ్రదర్స్ హవా నెల్లూరులో సాగింది. అందుకు ముందు కూడా ఎంతో మంది నెల్లూరు రెడ్డి ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రులుగా చక్రం తిప్పారు. నెల్లూరు జిల్లాకు చెందిన రెడ్డి సామాజికవర్గం నేత నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ఏకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇంతటి ఘన చరిత్ర గల నెల్లూరు జిల్లాలో ఇప్పుడు రెడ్లి ఉనికే లేకపోవడం వారిని బాధపడుతోంది. అదీ రెడ్డి సామాజికవర్గానికే చెందిన సీఎం జగన్ ప్రభుత్వంలో రెడ్ల ఇలాకాలో రెడ్లకే ప్రాధాన్యం లేకపోవడంతో వారంతా ఖిన్నుగా ఉండిపోతున్నారట..
అలాంటి రెడ్లకు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అవమానం జరుగుతోందని ఆ వర్గం వారంతా వాపోతున్నారట.. నెల్లూరు జిల్లాలో ప్రతీ రెడ్డి ఎమ్మెల్యేలది ఒక్కో చరిత్ర ఉంది. కానీ తీరా చూస్తే నెల్లూరు పెద్దా రెడ్లకు అధికారులు కనీసం స్పందించడం లేదు అని.. అసలు రెడ్లకు ప్రాధాన్యమే ఇవ్వడం లేదు అని కుమిలిపోతున్నారట.. ఇప్పుడు నెల్లూరులో అంతా ఆ మంత్రి చెప్పినట్టే సీఎం జగన్ వింటున్నాడని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్వరలోనే నెల్లూరు పెద్ద రెడ్లు , ఎమ్మెల్యేలు, బిజినెస్ మ్యాన్స్ తో మీటింగ్ పెట్టుకోవాలని ఆలోచనలో ఉన్నారని నెల్లూరులో టాక్ నడుస్తోంది.