మ‌ళ్లీ వివాదంలో అనిల్ ! బాబును అంత మాట‌న్నాడే !

Update: 2022-05-14 04:28 GMT
నెల్లూరు జిల్లా కేంద్రంగా రాజ‌కీయాలు న‌డిపే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ మ‌ళ్లీ వివాదాల్లో ఇరుక్కున్నారు. స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌ల సంగ‌తి అటుంచి విప‌క్ష నేత‌ల‌పై అదే ప‌నిగా విమ‌ర్శ‌లు చేస్తూ ప్ర‌భు భ‌క్తి చాటుకుంటున్నారు అన్న విమ‌ర్శ‌లు మాత్రం విప‌క్షం నుంచి వ‌స్తున్నాయి. ఒక్క విప‌క్ష‌మే కాదు అధికార ప‌క్షం కూడా అనిల్ ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు అన్న‌ది ఓ వాస్త‌వం.

కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి (తాజా మంత్రి) తో వివాదాలు స‌మ‌సిపోయాయి అని పైకి అనుకున్నా అవేవీ త‌గ్గ‌లేదు.. ఆ సెగ ఆగ‌లేదు. కానీ ఏదో ఆగిన విధంగా పైకి ఓ పూత మాత్రం క‌నిపిస్తోంది. ఇక మ‌రో ఎమ్మెల్యే కోటంరెడ్డితో కూడా ఆయ‌న‌కు పెద్ద‌గా స‌ఖ్య‌త లేదు. ఇవి కూడా ప్ర‌జ‌ల నమ్మ‌కాల‌ను ముఖ్యంగా నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను ప్ర‌భావితం చేసేవే క‌దా ! వాటిపై కూడా మాట్లాడుకోవాలి ఎవ్వ‌రైనా స‌రే ! కానీ విప‌క్షంను టార్గెట్ చేసి మాట్లాడినంత మాత్రాన నాలుగు ఓట్లు అధికంగా వ‌స్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

ఇక చంద్ర‌బాబు ఎవ‌రితో క‌లిసి వెళ్తారో ఎవ‌రిని పెళ్లి చేసుకుంటారో, ఎవ‌రితో పొత్తు పెట్టుకుంటారో మాకు అన‌వ‌స‌రం అని కీల‌క వ్యాఖ్య ఒక‌టి చేసి విప‌క్షానికి దొరికి పోయారు. ఆయ‌నకు అవి ప‌ట్టింపు లేన‌ప్పుడు, ప్ర‌జా స‌మ‌స్య‌లే ప‌ర‌మావ‌ధి అయిన‌ప్పుడు ఎందుక‌ని ప‌దే ప‌దే విప‌క్ష పార్టీల నేత‌లను ఉద్దేశించి వారి వ్య‌క్తిగత జీవితాల‌ను ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేయ‌డం? ఇదే ప్ర‌శ్నకు స‌మాధానం ఇవ్వండి అని వైసీపీని అడిగితే దాటవేత ధోర‌ణి త‌ప్ప మ‌రొక‌టి ఉండ‌దు.

అస‌లు త‌మపై తాము న‌మ్మ‌కం లేక‌పోతేనే పొత్తుకు వెళ్తారు అని అంటున్నారు స‌రే మ‌రి! ఆ రోజు వైఎస్సార్ కూడా పొత్తుతోనే  ముందుకువెళ్లారే ! అంటే ఆ రోజు వైఎస్ కు అస్స‌లు న‌మ్మ‌కాలు లేవా ? లేదా అప్ప‌టికి అనిల్ లాంటి నాయ‌కులు ఆయ‌న ద‌గ్గ‌ర లేరా? సుదీర్ఘ కాలం రాజ‌కీయం చేసిన కాంగ్రెస్ అయినా పొత్తుల‌తోనే ముందుకువెళ్లాల‌నుకుంటోంది. అంతెందుకు నిన్న‌మొన్న‌టి దాకా బీజేపీ కూడా కూట‌మి రాజ‌కీయాలలో భాగంగానే నెట్టుకువ‌చ్చింది. ఒక్క‌సారి 2019లో వ‌చ్చిన ప్ర‌భంజ‌నం కార‌ణంగానే నెగ్గుకువచ్చింది.

ఏదేమ‌యినా..మా సీఎంకు తిరుగులేని నేత అని పేరుంద‌ని మీరే క‌దా ! చెబుతున్నారు.. అలాంట‌ప్పుడు ఎదుటి వారి స్నేహం పైనో లేదా న‌మ్మ‌కంపైనో మీకెందుకు అసహ‌న భావాలు ? అని ప్ర‌శ్నిస్తోంది విప‌క్షం. ఇప్ప‌టిదాకా సొంత పార్టీలో ఉన్న అస‌మ్మ‌తిని దిద్దుకోలేని  నేత‌లు అంతా త‌మ‌పై వాగ్ధాటి ప్ర‌ద‌ర్శించ‌డం త‌గ‌ద‌ని అంటోంది విప‌క్షం.
Tags:    

Similar News