ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార.. విపక్ష నేతల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదాలు తెలిసినవే. హద్దులు దాటిన ఆరోపణలు.. విమర్శలతో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు అట్టుడికిపోయిన సంగతి తెలిసిందే. అయితే.. ఏపీ అధికారపక్ష మహిళా ఎమ్మెల్యే అనిత మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన రోజా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదంగా మారాయి. తనపై వ్యక్తిగత విమర్శలకు దిగిన రోజా అనకూడదని మాటలు అన్నట్లు.. పత్రికల్లో రాయలేని పదాల్ని వినియోగించినట్లుగా అనిత వాపోయారు.
తనపై రోజా చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలిచివేసినట్లుగా ఆమె ఆరోపించారు. మితిమీరి వ్యవహరిస్తున్న రోజా దారుణంగా మాట్లాడుతున్నప్పటికీ విపక్ష నేత వైఎస్ జగన్ మాత్రం ఆమెను వారించటం లేదంటూ అనిత ఆరోపించారు. తనపై ఇష్టమొచ్చినట్లుగా రోజా చేసిన వ్యాఖ్యలపై తాజాగా తాను రూ.కోటి పరువునష్టం దావా వేసినట్లుగా ప్రకటించారు. రోజాకు ఇప్పటికే నోటీసులు పంపినట్లుగా పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత వెల్లడించారు. తాజా నోటీసులకు రోజా రియాక్షన్ ఏమిటో..?