కర్ణాటక లో హనీట్రాప్ ఎమ్మెల్యే ల కి నిద్రలేకుండా చేస్తుంది. ఏ క్షణం లో ఎవరి వీడియో బయటకి వస్తుందో అని భయంతో వణికిపోతున్నారు. ఈ హనీట్రాప్ లో ఇద్దరు అనర్హత ఎమ్మెల్యేలతోపాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా ఇందులో చిక్కుకున్నారు. వీరిలో ఓ ఎమ్మెల్యే సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపద్యం లో సీసీబీ పోలీసులు రఘు అలియాస్ రాఘవేంద్ర తో పాటు నలుగురు హనీట్రాప్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. దీనితో ఈ కేసుని సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు వేగంగా విచారణ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓ ఎమ్మెల్యే హనీట్రాప్ ముఠాలో చిక్కిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియో రఘు అరెస్ట్ అయిన తరువాత , అతడి ఇంట్లో ఇంకా కొంతమంది ఎమ్మెల్యేల హనీట్రాప్ వీడియో గురించి నిజానిజాలు రాబట్టడానికి ఎఫ్ ఎస్ ఎల్ ఈ వీడియో ను సీసీబీ పోలీసుల కు అందించింది. ఎఫ్‌ఎస్‌ఎల్ అందించిన నివేదిక అనంతరం మరిన్ని వీడియోలు బయటికి వచ్చాయి.
నిజంగా ఎమ్మెల్యేలు హనీట్రాప్ లో చిక్కుకున్నారా లేక నకిలీ వీడియో సృష్టించి ఎమ్మెల్యేలను బెదిరించి డబ్బు తీసుకున్నారా అనే దాని గురించి సెంట్రల్ క్రైం బ్రాంచ్ విచారిస్తుంది. దీనితో హనీట్రాప్ గురించి ఎమ్మెల్యేల వద్ద సమాచారం రాబట్టడానికి సెంట్రల్ క్రైం బ్రాంచ్ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. లీకైన వీడియోలలో ఉన్న ఎమ్మెల్యేలు చెప్పే ఆధారాల బట్టి పోలీసులు విచారణ ఇంకా వేగవంతం చేసే అవకాశం ఉంది.