2014లో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో టీడీపీ అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గత నాలుగేళ్లుగా ఏపీలో వైసీపీ అధినేత జగన్ కు విపరీతమైన ప్రజాదరణ వస్తోన్న సంగతి తెలిసిందే. ఆ ఆదరణ చూసి ఓర్వలేని ఏపీ సీఎం చంద్రబాబు....ఫ్రస్టేషన్ లో పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా బాబుగారి డైలాగ్ ఒకటి బాగా పాపులర్ అయింది. నేను వేసిన రోడ్లమీద తిరుగుతూ నాకు ఓట్లు వేయరా? అని ప్రజలను బాబు గద్దించారు. తమ ప్రాంతంలో విద్యుత్ కోతలపై ప్రశ్నించిన యువకుడిని ...నీది వైసీపీ అయితే నా సభలకు రావద్దంటూ బాబు వార్నింగ్ ఇచ్చారు. జాతీయ మీడియా కూడా బాబుగారి వ్యాఖ్యలను హైలైట్ చేసింది. సీన్ కట్ చేస్తే....సరిగ్గా అవే డైలాగులను ప్రకాశం జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే మక్కికి మక్కి దించేశారు. మీరు మా పార్టీ వారు కాదు..మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు..నేను వేయించిన రోడ్లపై నడవొద్దు...అని ఎమ్మెల్యే స్వామి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి.
ఆవు చేలో మేస్తే ...దూడ గట్టున మేస్తుందా అన్నట్లు....సీఎం స్థాయి వ్యక్తి ...మాట్లాడిన మాటలను ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అనుసరించడంలో తప్పులేదనిపిస్తోంది. సమస్యలను పరిష్కరించడం మహా ప్రభో అని తన వద్దకు వచ్చిన రైతులపై కొండపి శాసన సభ్యుడు స్వామి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పొన్నలూరు మండలం పెదవెంకన్నపాలెంలో శుక్రవారం జరిగిన గ్రామదర్శిని–గ్రామ వికాసం కార్యక్రమంలో స్వామి ..షాకింగ్ కామెంట్స్ చేశారు. రుణమాఫీ డబ్బులు బ్యాంకు ఖాతాలకు జమ కాలేదని ప్రజలు ప్రశ్నించడంతో..ఆయన ఉగ్రరూపం దాల్చారు. ఇది పార్టీ కార్యక్రమమని, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఫైర్ అయ్యారు. మీరు మా పార్టీ కాదు...వాడు, వీడు అంటూ పరుష పదజాలంతో దూషించి దిక్కున్న వారికి చెప్పుకోవాలని కసురుకున్నారు. అయితే, తాము ఎన్నుకున్న ఎమ్మెల్యే అయి ఉండి తమపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఏమిటని...ప్రజలు ప్రశ్నించారు. దీంతో, ప్రశ్నించిన వారిపై స్వామి...పోలీసులను పురమాయించారు. మీరు వైసీపీకి చెందిన వారంటూ దూషించారు. ఆ వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కూడా విస్తుపోయారు. ప్రజల సొమ్ముతో వేసిన రోడ్ల పై నడవద్దని ఎలా చెప్తారంటూ ప్రజలు ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేశారు.