పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఎప్పుడూ లేనన్ని చిత్రవిచిత్రమైన సన్నివేశాల్ని ఆవిష్కరిస్తోంది. ధనబలంతో దర్జాగా ఉన్నోళ్లందరికీ ఇప్పుడు రద్దు దిగులు పట్టుకుంది. కుప్పులు కుప్పలుగా దాచి ఉంచిన నోట్ల కట్టలు ఏం చేసుకోవాలో తెలీని పరిస్థితి. ఒకవేళ.. బ్యాంకులకు తీసుకెళ్లినా? ఈ డబ్బంతా ఎక్కడిదన్న లెక్క చూపించాల్సిన దుస్థితి. దీంతో.. మరిన్ని చిక్కులే. దీంతో.. ఏం చేయాలో తోచక కిందామీదా పడుతున్నోళ్లు కొందరైతే.. మరికొందరు జరిగిందేదో జరిగిపోయింది.. పోయిన దాన్ని ఏటూ తీసుకురాలేం కాబట్టి.. ఉన్నదాన్ని ఉపయోగపడేలా ఏదో ఒకటి చేద్దామన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
దీనికి అతికినట్లుగా ఒక ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యారు. ప్రస్తుత పరిస్థితికి తనదైన తెలివిని జోడించిన ఆయన సరికొత్త ప్లాన్ వేశారు. తన దగ్గరున్న కట్టల కొద్దీ ధనాన్ని కుప్పలుగా పోసి మరీ ఒక్కొక్కరికి రూ.3లక్షల చొప్పున అప్పు లెక్కన పంచేసిన ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అప్పు పేరిట కొత్త దుకాణాన్ని తెరిచారు.
తన దగ్గరున్న నోట్ల కట్టల్ని అప్పు లెక్కన ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున పంచారు. ఇందుకోసం షామియానా వేసి.. తన పరివారాన్ని పిలిచి.. పెద్ద టేబుల్ వేసి.. నోట్ల కట్టల్ని పేర్చేసి మరీ.. పంపిణీ ప్రోగ్రాం మొదలెట్టారు. పనిలో పనిగా ప్రచారానికి పనికి వస్తుందని భావించారేమో కానీ.. ఈ కార్యక్రమాన్ని ఫోటోలు గట్రా తీయించుకున్నారు.
ఇక.. ఎమ్మెల్యే గారి దొడ్డ మనసుకు జనం మొదట సంతోషంగా ఆయన ఇచ్చిన లక్షల మొత్తాన్ని తీసుకున్నారు. కానీ.. ఆయనిచ్చిన నోట్లు చెల్లుబాటు కావని.. ఒకవేళ చెల్లుబాటు అయ్యేలా చేసుకోవాలంటే బ్యాంకుల దగ్గరకు వెళ్లి మార్చుకోవాలన్న విషయం అర్థమై ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే పరిస్థితి. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఉదంతానికి సంబంధించిన ఫోటోల్ని మీరూ చూడండి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/