తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామా లేఖను తీసుకోవటానికి చాలా పెద్ద డ్రామానే జరిగింది. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలన్న కేంద్రనిర్ణయానికి వ్యతిరేకంగా గంటా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై ఇప్పటికి గంటా మూడుసార్లు రాజీనామాలు చేయటంతో అదో పెద్ద ప్రహసనంగా మారిపోయింది. గంటా రాజీనామా అంటేనే అందరికీ నవ్వులాటగా మారిపోయింది.
దాంతో చాలా సీరియస్ గా గంటా మరోసారి రాజీనామా చేసి అసెంబ్లీకి పంపారు. తన రాజీనామా లేఖను తాజాగా విశాఖ జర్నలిస్టుల ఫోరం నేతలకు అప్పగించి వారిని అమరావతికి పంపారు. అంటే తన రాజీనామా లేఖలో ఎలాంటి డ్రామాలు లేవని చెప్పేందుకే గంటా ప్రయత్నించారని అర్ధమైపోతోంది. ఆ లేఖను తీసుకుని అమరావతిలోని అసెంబ్లీకి చేరుకున్న జర్నలిస్టులకు విచిత్రమైన పరిస్దితులు ఎదురయ్యాయి. రాజీనామా లేఖను తీసుకోవటానికి ఏ అధికారి కూడా ముందుకు రాలేదట.
జర్నలిస్టులు ఏ అధికారిని కలిసినా దాంతో తమకు సంబంధం లేదంటే తమకు సంబంధం లేదని తప్పించుకున్నారట. అసెంబ్లీ ఉన్నతాధికారుల చుట్టూ సుమారు 4 గంటల పాటు జర్నలిస్టులు తిరిగినా ఉపయోగం లేకపోయింది. దాంతో చేసేది లేక చివరకు జరిగిన విషయం మొత్తాన్ని జర్నలిస్టులు గంటాకే ఫోన్లో చెప్పారు. దాంతో గంటా వెంటనే అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు మాట్లాడారు. తర్వాత ఏమైందో ఏమో కానీ కార్యదర్శి జర్నలిస్టులను పిలిపించుకుని గంటా రాజీనామా లేఖను తీసుకున్నారు.
తన రాజీనామా లేఖను కార్యదర్శి తీసుకున్నారని నిర్ధారించుకున్న తర్వాత గంటా ఇదే విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ తో మాట్లాడారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని గట్టిగా కోరారు. మరి స్పీకర్ ఇపుడు ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది. అసలు గంటా రాజీనామా లేఖను తీసుకోవటానికి అసెంబ్లీ అధికారులు ఎందుకు వెనకాడారు అన్నదే ఎవరికీ అర్ధం కావటంలేదు. మరి ఇపుడైనా గంటా రాజీనామా డ్రామాకు తెరపడుతుందేమో చూడాలి.