విశాఖ ఉక్కు: గంటా రాజీనామా...ఇరకాటంలో పడ్డ వైసీపీ !

Update: 2021-03-25 12:30 GMT
ఏపీలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యవహారం వైసీపీని ఇరకాటంలో పడేసేలా ఉంది. విశాఖలో నిరసనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ తాజాగా పార్లమెంటులో స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్వరం పెంచుతోంది. అయితే ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు కూడా అర్ధాంతరంగా వాయిదా పడిపోవడంతో ఇక క్షేత్రస్ధాయిలోనే తేల్చుకునేందుకు సిద్ధం అవుతుంది. ఇది ఎలా ఉన్నా కూడా ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ చేసిన రాజీనామాను ఆమోదించాలా వద్దా అనే విషయంలో మాత్రం వైసీపీ ఓ నిర్ణయం తీసుకోలేకపోతుంది.

ముందు స్పీకర్ ఫార్మాట్‌లో కాకుండా విశాఖ స్టీల్‌ కోసం అన్నట్లుగా పంపిన రాజీనామా లేఖపై విమర్శలు రావడంతో ఆ తర్వాత మరోసారి స్పీకర్‌ ఫార్మాట్ లో  నే లేఖను పంపారు. దీంతో ఆయన రాజీనామా ఆమోదం విషయంలో నిర్ణయం అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే,రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. మాములుగా అయితే ఇప్పటికే గంటా రాజీనామా ఆమోదించి , ఉప ఎన్నికకి కూడా వైసీపీ సిద్ధం అయ్యేది. కానీ , యన చేసిన రాజీనామా తీవ్ర భావోద్వేగాలతో కూడుకున్న విశాఖ స్టీల్‌ వ్యవహారంపై కావడంతో వైసీపీ కూడా ఆలోచనలో పడేసింది. గంటా తాను రాజీనామా చేసిన తర్వాత వైసీపీ నేతలు కూడా రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని నాన్‌-పొలిటికల్‌ జేఏసీ ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అయితే మరో అడుగు ముందుకేసి గంటా తరహాలోనే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తే వారిపై పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా గెలిపిస్తామన్నారు. ఐతే వైసీపీ నేతలు మాత్రం రాజీనామాలతో స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగదని బహిరంగంగానే చెప్తున్నారు.

ఈ రాజీనామా విషయం పై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం సమావేశమయ్యారు. ఈ భేటీలో తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ను కోరినట్లు సమాచారం.  అయితే గంటా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే కావున,  ఉప ఎన్నిక కావాలని అధికార పార్టీ అనుకంటే స్పీకర్ విచక్షణాధికారంతో రాజీనామాను ఆమోదించే అవకాశం ఉంది. ఇలాంటి ఇబ్బంది కూడా ఉంటుందని గంటా అనుకున్నారో ఏమో గానీ.. తన లేఖలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తైన తర్వాత ఆమోదించాలని కోరారు. అది ఇప్పుడు అంత త్వరగా జరిగే పనికాదు. ఇప్పుడు స్పీకర్ కోర్టులో బంతి ఉంది. దీనిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. రాజీనామా ను ఆమోదించుకోవడం కోసం గంటా చేస్తున్న ప్రయత్నాలకు ఒక రకంగా వైసీపీనే కారణం. రాజీనామా లెటర్ స్పీకర్ కి పంపిన తర్వాత వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉత్తుత్తి రాజీనామా గంటలంటూ ట్వీట్లు పెట్టి గంటాను టార్గెట్‌ చేశారు. దీనితో అయన ఈ రోజు స్పీకర్ ను కలిసి తన రాజీనామాను ఆమోదించాలని కోరినట్టు చెప్పారు. ఒకవేల రాజీనామా చేస్తే ఉక్కు కోసం రాజీనామా చేసిన టీడీపీ  ఎమ్మెల్యే గా గంటా నిలిస్తే వైసీపీ నేతలు ముద్దాయిలుగా మిగిలిపోతారు. తాము రాజీనామాలు చేయకుండా, గంటా చేసిన రాజీనామాను ఆమోదించలేదనే అపప్రద మూటగట్టుకోవాల్సి వస్తుంది. దీనితో వైసీపీ తీవ్ర ఇరకాటంలో పడింది అని చెప్పాలి. మొత్తంగా ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ముందు గొయ్యి వెనుక నొయ్యి అన్నట్టుగా తయారైంది.
Tags:    

Similar News