గంటా కోరిక జ‌గ‌న్ తీర్చ‌రంటే తీర్చ‌రు?

Update: 2021-03-27 04:48 GMT
గంటా శ్రీనివాస‌రావుకు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో టీడీపీలో ఉండ‌డం.. ఆ పార్టీని న‌మ్ముకుని రాజ‌కీయాలు చేయ‌డం ఎంత మాత్రం ఇష్టంలేద‌న్న‌ది వాస్త‌వం. టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లాలి... అందుకో కార‌ణం కావాలి... అది జ‌నాలు కొంతైనా న‌మ్మేలా ఉండాలి... ఇందుకోసమే ఆయ‌న గ‌త రెండేళ్లుగా బ‌య‌ట‌కు రాలేక‌... క‌నీసం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నా.. ఆ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రు కాలేక నాన్చుతూ నాన్చుతూ వ‌స్తున్నారు. మ‌ధ్య‌లో వైసీపీలోకి వెళ్లే ప్ర‌య‌త్నాలు చేసినా అక్క‌డ కూడా ఆయ‌న కండీష‌న్ల‌కు ఓకే అని చెప్ప‌క‌పోవ‌డంతో వెయిట్ చేసి చివ‌ర‌కు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను త‌న రాజీనామాకు ఉప‌యోగించుకున్నారు. ఆయ‌నేమైనా ప‌ద‌వికి రాజీనామా చేసి ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చి పోరాటం చేస్తున్నారా ? అంటే అదీ లేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఆయ‌న స్పీక‌ర్ త‌మ్మినేని సీతారం సొంత ఊరు వెళ్లారు. స్పీక‌ర్ గంటాను పిల‌వ‌క పోయినా ఆయ‌నే త‌నంత‌ట తానుగా ఆముదాల‌వ‌ల‌స వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే తాను పంపిన రాజీనామా లేఖ‌ను ప‌రిశీలించి రాజీనామాను ఆమోదించాల‌ని గంటా కోరిన‌ట్టు స‌మాచారం. ఇక త‌మ్మినేని ఆ లేఖ‌ను ప‌రిశీలించి నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పార‌ని కూడా చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ ఆగాలంటే అందుకు ప్ర‌జాప్ర‌తినిధులు రాజీనామా చేయ‌డ‌మే స‌రైన నిర్ణ‌యం అని..త‌న‌తో పాటు జిల్లాలో మిగిలిన ప్ర‌జా ప్ర‌తినిధులు అంద‌రూ కూడా రాజీనామా చేయాల‌ని గంటా కోరుతున్నారు.

ఈ ఉప ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌న‌ని.. స్టీల్ ప్లాంట్ జేఏసీ ఎవరు ప్రతిపాదిస్తే వారికే మద్దతిస్తానని ప్రకటించారు. ఏదేమైనా గంటాకు ఇప్పుడున్న ఎమ్మెల్యే ప‌ద‌వి ఉన్నా.. ఊడినా పోయేదేం లేదు. స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశాన‌న్న సానుభూతి ఆయ‌న‌కు మిగులుతుంది. ఇక ఆయ‌న చెప్పిన‌ట్టు మిగిలిన ప్ర‌జా ప్ర‌తినిధులు ఎవ్వ‌రూ త‌మ ప‌ద‌వులు వ‌దులుకోరు. ఇక గంటా రాజీనామా ఆమోదిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ మ‌రింత ఉధృతం అవుతుంది. జ‌గ‌న్ ఆ ఛాన్స్ ఇవ్వ‌రు... త‌మ్మినేని గంటా రాజీనామా ఆమోదించ‌రు. ఏదేమైనా గంటా ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి మ‌ళ్లీ రాజ‌కీయాల్లో హైలెట్ అవ్వాల‌ని వేస్తోన్న ఎత్తులు... తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చేందుకు ఆయ‌న ప‌డుతోన్న క‌ష్టాలు ఫ‌లించేలా లేవు.
Tags:    

Similar News