అసెంబ్లీలో ర‌ఘురామ‌పై ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్య‌లు.. జ‌గ‌న్ అభినంద‌న‌లు

Update: 2021-05-20 13:30 GMT
ఏపీ అసెంబ్లీలో ఇవాళ ఒక్క‌రోజు బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం అనంత‌రం ధ‌న్య‌వాదాలు తెలిపే స‌మ‌యంలో వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ గుర్తు మీద, నాయకుడి ఫొటోతో రఘురామ గెలిచారన్న రమేష్.. ఆయన రాజీనామా చేస్తే వార్డు మెంబర్ గా కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు.

అయితే.. అసెంబ్లీలో ఎంపీ గురించి మాట్లాడాల్సి వచ్చినందుకు విచారం వ్యక్తం చేశారు. ఎంపీ గురించి అసెంబ్లీలో విమర్శించడం తప్పని చెప్పిన జోగి రమేష్.. తాను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుంటే తన వ్యాఖ్యలను రికార్డులోంచి తొలగించాలని స్పీకర్ ను కోరారు.

ఈ సంద్భంగా స్పందించిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్.. ఎమ్మెల్యే ర‌మేష్ ను అభినందించారు. ర‌మేష్ బాధ‌లో ఆప్యాయ‌త క‌నిపించింద‌న్న సీఎం.. త‌న వ్యాఖ్య‌ల‌ను రికార్డులోంచి తొల‌గించాల‌ని కోర‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఈ విష‌యంలో ఎమ్మెల్యేకు థాంక్స్ చెప్పాల‌ని అన్నారు.

కాగా.. సామాజిక వ‌ర్గాల మ‌ధ్య విద్వేషాలు ర‌గిలిచేందుకు ప్ర‌య‌త్నించార‌నే అభియోగంపై సీఐడీ అధికారులు ర‌ఘురామ‌ను అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. విచార‌ణ సంద‌ర్భంగా త‌న‌పై దాడిచేశార‌ని ఎంపీ ఆరోపించారు. ఈ కేసులో.. సుప్రీం కోర్టు ఆదేశాల మేర‌కు హైద‌రాబాద్ లోని ఆర్మీ ఆసుప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. రిపోర్టును సీల్డ్ క‌వ‌ర్ లో తెలంగాణ హైకోర్టు ద్వారా సుప్రీం కోర్టుకు అంద‌జేశారు. ఆ రిపోర్టులో ఏముంది అనే విష‌య‌మై ఉత్కంఠ నెల‌కొంది.
Tags:    

Similar News