ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ...నిజామాబాద్ లో పతంజలి యోగ పీఠం నిర్వహిస్తున్న ఉచిత యోగ చికిత్స, ధ్యాన శిబిరంలో పాల్గొంటోన్న సంగతి తెలిసిందే. నేటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో ఆయన శిక్షణ ఇవ్వబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆ తర్వాత, శిబిరానికి హాజరైన వారి చేత బాబా రాందేవ్ యోగాసనాలు వేయించారు. ఆ సందర్భంగా ఎంపీ కవితతో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్‌రెడ్డి కూడా వేదికపై యోగాసనాలు వేశారు. అయితే, యోగాసనాలు వేసేటపుడు జీవన్ రెడ్డి కొద్దిగా ఇబ్బంది పడ్డారు. బాబా రాందేవ్ చెప్పినట్లు భంగిమలు వేయలేక కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఆ సందర్భంలో జీవన్ రెడ్డి హావభావాలు, భంగిమల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కవితతోపాటు గణేష్ గుప్తా కూడా బాబా రాందేవ్ చెప్పిన భంగిమలలో యోగాసనాలు వేసేందుకు ప్రయత్నించారు. అయితే, జీవన్ రెడ్డి మాత్రం ఆ యోగాసనాలు వేసేందుకు ఇబ్బంది పడ్డారు. చేతులు దూరంగా ఉంచాల్సిన సందర్భంలో....దగ్గరగా ఉంచి....ఓ ఆసనం వేశారు. అంతేకాకుండా, ఓ యోగాసనం సందర్భంగా నడుమును వంచలేక కొద్దిగా ఇబ్బందిపడిపోయారు. ఆ ఆసనాలు వేయలేక...ఆయనలో ఆయనే నవ్వుకున్నారు. నవ్వుతూనే ఎలాగోలా కవితతోపాటు ఆసనాలు వేశారు. అయితే, జీవన్ రెడ్డి ఇబ్బందిపడుతూ ఆసనాలు వేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎమ్మెల్యేగారికి ఎన్ని కష్టాలు వచ్చాయో అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
వీడియో కోసం క్లిక్ చేయండి
Full View