తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఓ పెళ్లి వేడుకలో ఊహించని షాక్ తగిలింది. తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లాలోని దేవర కద్రలోఓ పెళ్లికి హాజరైయ్యారు. ఆ పెళ్లి కాసేపు అందరితో సందడి చేసారు. ఈ సమయంలోనే మంత్రితో సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు ఎగబడటం తో అందరికి ఏంటో ఉత్సహంగా సెల్ఫీలకు ఫోజులిచ్చారు. అలాగే ఆయన తో షేక్ హ్యాండ్ తీసుకోవడానికి కూడా పోటీపడ్డారు. అయితే , సందట్లో సడేమియా అన్నట్టుగా ... మంత్రి అందరి తో బిజీగా ఉన్న సమయంలోనే మంత్రి గారి చేతికి ఉన్న కడియాన్ని కూడా లాగేసుకొని వెళ్లిపోయారు.
అయితే , ఈ హడావిడి అంతా ముగిసిన తరువాత చేతికి ఉన్న కడియం కనిపించక పోవడం తో ఒక్కసారిగా శ్రీనివాస్ గౌడ్ షాక్ కి గురైయ్యారు. అనుచరులపై కూడా ఆయన ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అలాగే మీరేమైనా చేయండి.. ఏం చేస్తారో నాకనవసరం.. ఆ కడియం కావాల్సిందేనని పోలీసులకి ఆదేశాలు జారీ చేశారు. దీనితో బిత్తర పోయిన పోలీసులు ఎవరైనా తీసుంటే ఇచ్చేయండి, చోరీ చేసిన వారిని ఏమీ అనం అంటూ అక్కడున్నవారిని బతిమాలుకున్నారు.
అయితే శ్రీనివాస్ గౌడ్ ఇంతగా అసంతృప్తి చెందడానికి మరో కారణం ఉందని తెలుస్తోంది. తన చేజారిపోయిన కడియంమంత్రి గారికి ఎంతో సెంటిమెంట్ అని తెలుస్తోంది. ఆ కడియం పెట్టుకున్న తరువాత ఆయనకే అనేక విజయాలు దక్కాయని, అందుకే అది కనిపించకుండా పోవడం పట్ల ఆయన బాగా నిరాశ చెందారని పలువురు చెబుతున్నారు.