ఆ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రూటే సెపరేటు.. నడి రోడ్డుమీదే రికార్డింగ్ డ్యాన్సులు!
ప్రకాశం జిల్లా దర్శి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన బర్త్‌డే సందర్భంగా దర్శిలో ఆగస్టు 2 అర్ధరాత్రి రాత్రి రికార్డింగ్ డ్యాన్స్‌లు వేశారు.
స్థానిక గడియార స్తంభం సెంటర్‌లో అధికార వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో యువతులు వేదికపై రెచ్చిపోయి చిందేశారని మీడియాలో కథనాలు వచ్చాయి. అందులోనూ ఈ డ్యాన్స్‌లను ఎమ్మెల్యే వేణుగోపాల్, ఇతర నాయకులు స్టేజీ మీద కూర్చోని వీక్షించారని అంటున్నారు. ఎమ్మెల్యే బర్త్‌డే సందర్భంగా ఇలా పట్టణ నడిబొడ్డున రాకపోకలను నిలిపేసి రికార్డింగ్ డ్యాన్స్‌లు ఏర్పాటుచేయటంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారని చెబుతున్నారు.
ఎమ్మెల్యే అయిఉండి నడి రోడ్డుపైన అశ్లీల నృత్యాలు వేయించడం ఏంటని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట యువతులతో అశ్లీలంగా నృత్యాలు చేయించడంతో పాటు కొందరు అధికార పార్టీ కార్యకర్తలు వారితో కలిసి నృత్యాలు చేయడం కలకలం రేపింది. పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఈ తతంగం సాగుతున్నా అధికారులు పట్టించుకోలేదని ప్రజలు అంటున్నారు.
కాగా ఇటీవల మద్దిశెట్టికి చెందిన కాలేజీ ఉత్సవాల్లో విద్యార్థులతో జై పవన్ కల్యాణ్ నినాదాలతో హోరెత్తించారు. ఈ ఘటన వివాదాస్పదమైంది.
మద్దిశెట్టి వేణుగోపాల్ కాపు సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ప్రత్యర్థులు ఆయనపై వైఎస్సార్సీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. జనసేన అధినేత పవన్ కు మద్ధిశెట్టి వేణుగోపాల్ టచ్ లో ఉంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఈ రికార్డింగు డ్యాన్సుల వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో వేచిచూడాల్సిందేనంటున్నారు.
కాగా 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన మద్దిశెట్టి వేణుగోపాల్ గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున దర్శి నుంచి ఘన విజయం సాధించారు. అయితే దర్శిలో ఎమ్మెల్యే వేణుగోపాల్ కు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డికి తీవ్ర విభేదాలు ఉన్నాయని అంటున్నారు. అందులోనూ బూచేపల్లి తల్లి వెంకాయమ్మ ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా కూడా చేశారు.