తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సానియా మీర్జాను తొలగించి, పీవీ సింధును నియమించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. టోక్యో ఒలింపిక్స్ లో సింధు కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ఒలింపిక్స్ లో రెండు పతకాలు గెలిచిన తొలి మహిళా క్రీడాకారిణిగా సింధు నిలిచింది. దీంతో.. ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే.. ఈ సమయంలోనే హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కొత్త వాదన తెరపైకి తెచ్చారు.
ప్రస్తుతం తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఉన్న సంగతి తెలిసిందే. ఆమెను తొలగించి, సింధును నియమించాలన్నది ఆయన డిమాండ్. దీనికి ఆయన చూపుతున్న కారణం ఏమంటే.. సానియా మీర్జా పాకిస్తాన్ కోడలు అయ్యిందని, కాబట్టి ఆమెను వెంటనే తప్పించాలని అంటున్నారు. ఆమె స్థానంలో పీవీ సింధును బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని అన్నారు.
సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ కోడలుగా మారిపోయిన ఆమె.. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడమేంటని ఆయన ప్రశ్నించారు. గతంలోనూ ఈ డిమాండ్ వినిపించింది. పూల్వమా దాడి సమయంలోనూ ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. తాజాగా.. రాజాసింగ్ మళ్లీ ఈ డిమాండ్ ను పట్టుకురావడం గమనార్హం.