పెను ప్రమాదం ఒకటి తృటిలో తప్పింది. ఇటీవల కాలంలో నేతల కార్లు అదే పనిగా ప్రమాదానికి గురవుతున్నాయి. మితిమీరిన వేగం.. తమకేం కాదులే అన్న ధీమా.. వారిని డేంజర్లోకి వెళ్లేలా చేస్తున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతున్న వేళ.. ఖమ్మంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ సమీపంలోని శివాలయం వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయిన వాహనం నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు కాల్వలోకి టైరు ఇరుక్కుపోవటంతో పెను ప్రమాదం తప్పింది.
వాహనం ఒక పక్కకు ఒరిగిపోతుండగా డ్రైవర్ అలెర్ట్ గా ఉండటంతో బోల్తా పడకుండా ఆగింది. వెంటనే కారు దిగారు సండ్ర.. ఆయన గన్ మేన్. ఈ ఘటనను గుర్తించిన స్థానికులు అక్కడకు చేరుకొని వాహనాన్ని బయటకు తీశారు. శివాలయం ఎదురుగా జరిగిన ఈ ఘటన అనంతరం సండ్ర మాట్లాడుతూ.. తనను శివుడే కాపాడినట్లుగా పేర్కొన్నారు. అనంతరం.. ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు.