తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ పార్టీకి ఎమ్మెల్యే ఒకరు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే ఓ మహిళా ఎమ్మెల్యే సామాన్యులను బెదిరించగా హైదరాబాద్ పరిధిలోకి వచ్చే ఈ ఎమ్మెల్యే సాబ్ కాంట్రాక్టర్ ను బెదిరించాడు. ఇంత చేసి విషయం ఏంటంటే...గతంలో తనపై వచ్చిన వార్తను వాట్సప్ లో పెట్టడం.
తనకు వ్యతిరేకంగా గతంలో ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని వాట్సాప్ లో పెట్టినందుకు కాంట్రాక్టర్ దుర్గాప్రసాద్ ను టీఆర్ ఎస్ పార్టీ మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బెదిరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ కథనం తన సెల్ కు రావడంతో ఎమ్మెల్యే శివాలెత్తారు. దానికి సంబంధించి కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే బెదిరించిన సంభాషణను రికార్డు చేసిన సీడీ ఓ టీవీ చానల్ చేతికి చిక్కింది. ఆ సంభాషణ సదరు టీవీలో ప్రసారమైంది. ఇందులో సారంశం ప్రకారం ఎమ్మెల్యేగారు ఆ కాంట్రాక్టరును నీ అంతు చూస్తానంటూ బెదిరిస్తూ దుర్భాషలాడారు. బూతుపురాణం అందుకున్నాడు. తనకు సంబంధంలేదని మొత్తుకున్నా వాట్సాప్ లో నీపేరుతోనే వచ్చింది కనుక నీవు నిరూపించాలంటూ దూషించాడు.
పత్రికలోనే వార్త వచ్చిన తర్వాత తానెలా వాట్సాప్ లో పెడతానని, తనకు సంబంధంలేదని వేడుకున్నాడు. తన డ్రైవర్ చూపెడితే చూశానని, ఇందులో నీ నెంబర్ నుంచే వచ్చిందని, మర్చిపోతే మళ్లీ జ్ఞాపకం చేసుకో అని ఎమ్మెల్యే బెదిరించారు. ఫోన్ చూసి తిరిగి ఫోన్ చేస్తానని చెప్పినా ఎమ్మెల్యే కాంట్రాక్టర్ ను వేధించారు. ఈ విషయానికి ఫోన్ చేసి తిడతారని అనుకోలేదు అని, ఎవరు ఫోన్ చేయించారో తనకు తెలుసునని కాంట్రాక్టర్ అన్నారు. మళ్లీ కనపడు అప్పుడు జెప్త అని ఎమ్మెల్యే అనడంతో ఐదేండ్ల వరకు మీ దగ్గరికి రానుగూడ రాను అని కాంట్రాక్టర్ అన్నారు. నీ సంగతి చెప్తలే అని మరోసారి ఎమ్మెల్యే బెదిరించడంతో కాంట్రాక్టర్ దుర్గాప్రసాద్ గౌడ్ వణికిపోతున్నారు. ఎమ్మెల్యే బెదిరింపులతో దుర్గాప్రసాద్ మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. మూడు రోజులుగా ఇంటికి వెళ్లడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే - తన అనుచరుల నుంచి ప్రాణహాని ఉందంటూ రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారని సమాచారం.