జేసీకి వ‌య‌సొచ్చినా బుద్ధిరాలేదు:ప్రభాక‌ర్

Update: 2018-09-09 06:39 GMT
మ‌రి కొద్ది నెల‌ల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతోన్న నేప‌థ్యంలో టీడీపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు బ‌హిర్గ‌త‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. అయ్య‌న్న పాత్రుడు - గంటా శ్రీ‌నివాస్ ల మ‌ధ్య కోల్డ్ వార్ జ‌రుగుతుండ‌గానే...మ‌రోప‌క్క అనంత‌పురంలో ఎంపీ జేసీ-ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రిల మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధ‌మే న‌డుస్తోంది. అనంత‌పురంలో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ ప‌నుల విష‌యంలో అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకరచౌదరితో అనంత‌పురం ఎంపీ జేసీకి విభేదాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాక‌ర్ చౌద‌రిపై విమ‌ర్శ‌లు గుప్పించిన జేసీ...`రాజీ` నామా ఎపిసోడ్ చంద్ర‌బాబుకు చిక్కులు తెచ్చిపెట్టింది. చంద్ర‌బాబు జోక్యంతో రహదారుల విస్తరణకు రూ. 45 కోట్లు కేటాయిస్తూ జీవో విడుదల చేయించడంతో ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింది. తాజాగా, 4 రోజుల క్రితం మరోసారి ప్ర‌భాక‌ర్ చౌద‌రిపై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అనంత‌పురం అభివృద్ధిని ప్ర‌భాక‌ర్ అడ్డుకుంటున్నారని ప్ర‌భాక‌ర్ వల్ల తాను అనంతపురంలో ప్లాస్టిక్ వాడకం నిరోధించలేకపోయాయని, రోడ్లు విస్తరించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలో జేసీ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌భాక‌ర్ స్పందించారు.

త‌నపై వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌భాక‌ర్ చౌద‌రి తీవ్రంగా స్పందించారు. జీఏసీపై ప్రభాకర్ చౌదరి సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. జేసీకి వయసు మీద పడింద‌ని, అయినా బుద్ధి రాలేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. జేసీకి సభ్యతా సంస్కారాలు లేవని - అందుకే ఇష్టం వ‌చ్చిన‌ట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిప‌డ్డారు. అనంతపురం జిల్లాలో అధికారులను, మీడియాను జేసీ బెదిరిస్తున్నారని, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జేసీని తాను కూడా దూషించగలన‌ని, సంస్కారం అడ్డమొస్తోందని అన్నారు. జేసీ తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపిస్తే తన తల నరుక్కుంటానని జీసీకి  ప్ర‌భాక‌ర్ సవాల్ విసిరారు. సహనానికి కూడా హద్దులుంటాయని, ఇకపై తన సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చ‌రించారు. జేసీ తీరుతో పార్టీకి చాలా నష్టం జరుగుతోందని ప్రభాకర్ చౌదరి అన్నారు.

Tags:    

Similar News