కరోనా బారినపడ్డ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

Update: 2020-10-25 07:15 GMT
ఏపీలో కరోనా విస్తృతి కొనసాగుతూనే ఉంది.. రోజుకు కేసుల సంఖ్య తగ్గుతున్నా వ్యాపించే తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా బారినపడ్డారు. చాలా మందికి సోకుతూనే ఉంది. బయట కార్యక్రమాలకు హాజరైతే చాలు వైరస్ వ్యాపిస్తోంది.

కృష్ణ జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సైతం తాజాగా కరోనా బారినపడ్డారు. కొన్ని రోజులుగా ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తరుచుగా గ్రామాల్లో పర్యటనలు పెట్టుకుంటున్నారు. ఇటీవలే శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్లి వచ్చారు.  ఆ తర్వాత స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శనివారం కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. వైద్యుల సూచనల మేరకు ఆయన 14 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉంటారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి.
 
 తన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని ఎమ్మెల్యే వంశీ అన్నారు. తాను ఫోన్ ద్వారా కార్యకర్తలు, నేతలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.  

ఇక తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే వంశీ నేతలు, ప్రజలకు సూచించారు. హోం ఐసోలేషన్ లో ఉండాలని కోరారు.

మరోవైపు ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కాస్త తగ్గింది. గత కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.
Tags:    

Similar News