వైసీపీలో ఎక్కడ చూసినా వర్గ పోరు ఒక రేంజిలో ఉంది. ఎన్నికల ఏడాది కావడంతో ఆశావహులు ఇపుడు బయటపడిపోతున్నారు. తమ రాజకీయ వాటా తేల్చుకునేందుకు బాహబాహీ అంటున్నారు. 2019 ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఒక ఎంపీ సీటూ గెలిపించుకుని క్లీన్ స్వీప్ చేయించిన జిల్లా మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సైతం ఏమీ చేయలేని విధంగా జిల్లాలో వర్గ పోరు సాగుతోంది. ఒక విధంగా బొత్స చేయి దాటేసి మరీ వైసీపీ రాజకీయ పోరాటం తాడేపల్లి ప్యాలస్ దాకా చేరిందని అంటున్నారు.
విజయనగరం జిల్లాలో దాదాపుగా సగానికి పైగా నియోజకవర్గాలలో తన బంధువులను ఎమ్మెల్యేలుగా పెట్టి గెలిపించుకున్న బొత్సకు ఇపుడు సొంత పార్టీ నేతల నుంచే తిరుగుబాటు ఎదురవుతూండడం ఇబ్బందికరంగా మారింది. ఆయన సమీప బంధువుగా ఉన్న కడుబండి శ్రీనివాసరావుని ఎక్కడో గజపతినగరంలో ఓడిన వారిని తెచ్చి నాన్ లోకల్ అయినా ఎస్ కోట టికెట్ ని 2019 ఎన్నికల్లో బొత్స ఇప్పించేశారు.
అప్పటిదాకా ఆ సీటు మీద ఆశలు పెంచుకున్న ప్రస్తుత ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు దాంతో అలిగినా జగన్ సమక్షంలో సర్దుబాటు చేయించి ప్రచారానికి ఒప్పించారు. అలా ఇందుకూరి రఘురాజు ఆయన సతీమణి సుధారాజు పెద్ద ఎత్తున ప్రచారం చేసి కడుబండి శ్రీనివాసరావుని ఎమ్మెల్యేగా గెలిపించారు. అలా గెలిపించినందుకు రఘురాజును ఎమ్మెల్సీ కూడా చేశారు.
అయితే ఎన్నికలు దగ్గరలో పడడంతో రఘురాజు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. ఎస్ కోటలో ఆయన వర్గం బలంగా ఉంది. పైగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు నాన్ లోకల్. ఆయన గడచిన నాలుగేళ్ళుగా జనాలతో పెద్దగా టచ్ లో లేరని విమర్శలు ఉన్నాయి. సొంత వ్యాపారాలు పనులతోనే ఎమ్మెల్యే బిజీగా ఉన్నారని వైసీపీ నుంచే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా ఎస్ కోట వైసీపీలో రాజకీయం సాగుతోంది. దీంతో ఎమ్మెల్యే సైతం ఎమ్మెల్సీ రఘురాజు వర్గీయులను పదవుల విషయంలో ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కన పెట్టేసి మంట రాజెశారు. ఈ పరిణామాల నేపధ్యంలో రఘురాజు వర్గం లోకల్ బాడీ ఎన్నికల్లోనే రెడ్ సిగ్నల్ చూపించింది. తమకు ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేను కట్టడి చేయకపోతే తాము పార్టీకి పనిచేయమని హెచ్చరించింది. లోకల్ బాడీ ఎన్నికల్లో పెద్దలు సర్దిచెప్పిన తరువాత కూడా పరిస్థితి ఏమీ మారలేదు.
దాంతో రఘురాజు వర్గం ఇపుడు ఎమ్మెల్యేను బాహాటంగా వ్యతిరేకించడం మొదలెట్టింది. ఎస్ కోట. ఎల్ కోట. కొత్తవలస, వేపాడ, జామి మండలాలకు చెందిన వైసీపీ నేతలు, ముఖ్య నాయకులు అందరూ కలసి ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే శ్రీనివాసరావుని మార్చేయాల్సిందే అని గట్టిగా పట్టుపడుతూ తీర్మానాలు చేశారు. అంతటితో ఆగకుండా విశాఖ వైసీపీ రీజనల్ ఇంచార్జి వైవీ సుబ్బారెడ్డిని రఘురాజు సతీమణి సుధారాజుతో కలసి వినతిపత్రం సమర్పించారు.
ఈసారి ఎస్ కోట సీటుని క్షత్రియ సామాజికవర్గానికి ఇవ్వాలని లోకల్ కి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ విషయాన్ని అధినాయకత్వంతో చర్చిస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది. మరో వైపు చూస్తే ఇటీవల ఎస్ కోట వచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ ఎదుటనే ఎమ్మెల్సీ రఘురాజు వర్గానికి చెందిన మండల వైసీపీ నేత రహమాన్ ఎమ్మెల్యేకు వ్యతిరేక కామెంట్స్ చేశారు. ఆయన్ని తప్పించాలని కోరడంతో ఆగ్రహించిన బొత్స ఆయన్ని పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే లేదు అంటూ మందలించడం కూడా మీడియాలో కవర్ అయింది.
ఇలా బొత్సకు ఎస్ కోట సీటు బిగ్ ట్రబుల్ గా మారింది అని అంటున్నారు. ఎస్ కోటలో టీడీపీ బలంగా ఉంది. 2014 ఎన్నికల వరకూ ఆ పార్టీ గెలుస్తూ వచ్చింది. 2019లో మాత్రం వైసీపీ ఫస్ట్ టైం గెలిచి జెండా ఎగరేసింది. టీడీపీలో కూడా రెండు వర్గాలు ఉన్నాయి. అయితే దానిని మించి వైసీపీలో వర్గ పోరు బాహాటం కావడంతో టీడీపీ శ్రేణులు పండుగ చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు సునాయాసమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎస్ కోట చిక్కు ముడిని విప్పలేక వైసీపీ అధినాయకత్వం తల పట్టుకుంటోంది. అక్కడ తన బంధువులు సన్నిహితులకు టికెట్ ఇప్పించుకోవడానికి బొత్స చూస్తున్నారు అని టాక్. మొత్తానికి బలమైన నాయకుడుగా ఉన్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కనుక రివర్స్ అయితే ఎస్ కోట వైసీపీ పుట్టె మునగడం ఖాయమని అంటున్నారు.