ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యేలు తన్నుకున్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన నాటి నుంచి సభలో వివిధ అంశాలపై టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతి రోజూ స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మార్చి 20న సోమవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే ఎస్సీ ఎమ్మెల్యేలు అయిన ప్రకాశం జిల్లా కొండెపి టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయులు, సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు కొట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
రోడ్లపై ర్యాలీలు, సభలు, సమావేశాలను రద్దు చేస్తూ ఇటీవల జగన్ ప్రభుత్వం జీవో నంబర్ 1ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల సభలను అడ్డుకోవడానికే ఈ జీవోను తెచ్చిందని అప్పట్లోనే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో జీవో నంబర్ 1ను రద్దు చేయాలంటూ టీడీపీ శాసనసభ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానం ఇచ్చింది. సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానం పై చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. జీవో నంబర్ 1ను రద్దు చేయాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. అంతేకాకుండా స్పీకర్ తమ్మినేని సీతారాం పోడియం చుట్టూ చేరారు. స్పీకర్ దగ్గర ప్లకార్డులతో ప్రదర్శనకు దిగారు.
దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో స్పీకర్ ముఖంపై టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి ప్లకార్డును పెట్టారని తెలుస్తోంది. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ ప్లకార్డును పక్కకు తోసేయంతో వివాదం రాజుకుంది. దీని పై టీడీపీ ఎమ్మెల్యే డోలా.. స్పీకర్‌తో దురుసుగా ప్రవర్తించినట్టు సమాచారం.
దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ ను చుట్టుముట్టడంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఆయనకు రక్షణంగా పోడియం దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సహా మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లారు. ఈ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఉద్రికత్తలు ఏర్పడ్డాయని అంటున్నారు.
ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు కొట్టుకున్నట్టు తెలుస్తోంది. దీంతో.. సభలో ఒక్కసారిగా ఘర్షణ నెలకొంది. దీంతో వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో సహా తదితరులు టీడీపీ ఎమ్మెల్యేల పై దాడికి దూసుకెళ్లారని చెబుతున్నారు. ఈ క్రమంలో గొడవ మరింత పెద్దది కాకుండా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.
కాగా వైసీపీ ఎమ్మెల్యేలే తమ పై దాడి చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బాలవీరాంజనేయ స్వామిపై సుధాకర్ బాబు దాడి చేశారని మండిపడ్డారు. అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తోసేశారని తెలిపారు. సభలో తమ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని మండిపడ్డారు. తాము తప్పు చేశామనుకుంటే సస్పెండ్ చేయొచ్చని, చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. కానీ కొట్టించే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. తాము స్పీకర్ పై దాడి చేశామనుకుంటే ఉరి తీయొచ్చని.. కానీ దాడికి దిగడం ఏమిటని నిలదీశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.