ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: కేసీఆర్ ప్రమేయంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం

Update: 2022-12-28 16:15 GMT
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఆర్డర్ కాపీ చర్చనీయాంశమైంది. తాజాగా ఈ కేసును తెలంగాణసర్కార్ ఏర్పాటు చేసిన ‘సిట్’ను రద్దు చేసి సీబీఐకి బదిలీ చేస్తున్నట్టు అందులో పేర్కొంది.  ఈ మేరకు 98 పేజీల సుధీర్ఘమైన ఆర్డర్ కాపీ లో పలు కీలక విషయాలను హైకోర్టు జడ్జి  పేర్కొన్నారు. అందులో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా ఉండడం సంచలనమైంది.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మారిటీకి తప్పే.. కానీ సిట్ పరిధి దాటి వ్యవహరించిందని.. కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్స్ ను బహిర్గతం చేశారంటూ సిట్ ఉనికిని బెంచ్ ప్రశ్నించింది. అసలు ముఖ్యమంత్రికి సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందంటూనే దర్యాప్తు సమాచారం కేసీఆర్ కు చేరడంపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

దర్యాప్తు అధికారుల దగ్గర ఉండాల్సిన అధారాలన్నీ మీడియాకి, ప్రజల వద్దకు వెళ్లిపోయాయని అసహనం వ్యక్తం చేస్తూ.. సీబీఐ దర్యాప్తునకు అప్పగించడానికి 45 అంశాలను ఆర్డర్ కాపీలో చూపించింది.  కేసు దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతం అయ్యాయని జడ్జి ఆక్షేపించారు. సిట్ దర్యాప్తు నిజాయితీగా జరగలేదని స్పష్టం చేశారు.

దర్యాప్తు లో వెల్లడైన ఆధారాలు బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదు. న్యాయమైన విచారణతోపాటు దర్ాయప్తు కూడా సరైన రీతిలో జరగాలని నిందితులు కోరవచ్చు. బీజేపీ పిటీషన్ మెయింటైనబుల్ కాపోవడంతో పిటీషన్ డిస్మస్ చేశామని.. నిందితులు దాఖలు చేసిన రిట్ పిటీషనర్లను మాత్రం పరిగణలోకి తీసుకున్నామని న్యాయమూర్తి ఆ ఆర్డర్ కాపీలో  పేర్కొన్నారు.

ఈ ఎఫ్ఐఆర్ కాపీని సీబీఐకి బదిలీ చేయడంతోపాటు సిట్ చేసిన దర్యాప్తును సైతం రద్దు చేస్తున్నట్టు ఆ ఆర్డర్ కాపీలో న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి తెలిపారు. 26 కేసుల జడ్జిమెంట్ ను అందులో ప్రస్తావించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News