ఎమ్మెల్యే సోదరి కుటుంబం మృతి కేసు .. వారి కాల్ డేటాలో ఏముందంటే !

Update: 2020-02-19 08:40 GMT
అధికార టీఆరెస్ పార్టీ పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సోదరి కుటుంబం మొత్తం కారుతో సహా అల్గునూర్‌ శివారులో కాకతీయ కాలువలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే భావ సత్యనారయణరెడ్డి కారు ఏ తేదీన, ఏ సమయంలో కాలువలో పడిపోయింది, కాల్వలో కారు పడకముందు ఆ కారు ఎక్కడెక్కడ తిరిగింది అన్న కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేసారు. ఇందులో భాగంగానే సీపీ కెమెరాల ఫుటేజీలను మంగళవారం పరిశీలించారు.

సత్యనారాయణరెడ్డి ఒక్కడే జనవరి 26న హైదరాబాద్‌ వెళ్లొచ్చినట్లు తిమ్మాపూర్‌ మండలం రేణికుంట వద్ద రాజీవ్‌ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా వద్ద సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్టు గుర్తించారు. జనవరి 26వ తేదీఉదయం 11.44 గంటలకు రేణిగుంట టోల్‌ ప్లాజా నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లాడని... తిరిగి సాయంత్రం 8.15 గంటలకు కరీంనగర్‌ వైపు వచ్చాడని గుర్తించారు. ఈమేరకు సీసీ ఫుటేజీలు స్వీకరించినట్లు ఎల్‌ ఎండీ ఎస్సై నరేశ్‌ రెడ్డి వెల్లడించారు. కరీంనగర్‌ లోని సీసీ కెమెరాల్లో రికార్డు దృశ్యాల ప్రకారం జనవరి 27న సాయంత్రం వరకు నారాయణరెడ్డి కారు పలు ప్రాంతాల్లో కనిపించినట్లు తెలుస్తుంది. దీనితో ఆ చుట్టూ ప్రక్కల ఉన్న అన్ని సిసి కెమెరాల పుటేజెస్ ని పరిసలిస్తున్నారు.

అయితే , సత్యనారాయణరెడ్డి కుటుంబంతో సహా 27వ తేదీ సాయంత్రం బయల్దేరి వెళ్లినట్టు అతడి షాపులో పనిచేసే వ్యక్తి తెలిపాడు. దీంతో పోలీసులు 27 తేదీన అల్గునూర్‌ లో సీసీ కెమెరాలను పరిశీలించగా, ఉదయం నుంచి రాత్రి వరకు కారు అటుగా వచ్చినట్లుకనిపించలేదు. అలాగే రాత్రి నమోదైన దృశ్యాల్లో వాహనాల నంబర్లు సరిగా కనిపించకపోవడంతో మరింత నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఎల్‌ ఎండీ పోలీసులు తెలిపా రు. దీనితో అసలు ఆ కారు ఎప్పుడు కాల్వలో పడింది అన్న విషయం పై స్పష్టత రావడంలేదు. ఇక ఈ కేసులో అత్యంత కీలకంగా భావిస్తున్న .. సత్యనారాయణరెడ్డి కుటుంబ సభ్యుల సెల్‌ ఫోన్లకు సంబంధించి కాల్‌డేటా వివరాలు నేడు పోలీసుల చేతికి రాబోతున్నాయి. వారి కాలే డేటా వస్తే వారు చివరి ఫోన్‌ ఎవరికి చేశారు. ఏం మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు. అనే విషయాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఆ తరువాత ఈ కేసులో ఏదైనా పురోగతి కనిపించవచ్చు అని పోలీసులు చెప్తున్నారు.




Similar News