ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత నాలుగేళ్లుగా ప్రగల్భాలు పలుకుతోన్న సంగతి తెలిసిందే. అరచేతిలో అమరావతిని చూపిస్తూ....బాహుబలిని తలదన్నే రీతిలో డిజైన్లు....రీ డిజైన్లతో మరపిస్తూ మాయ చేస్తున్నారు. మయ సభను తలపించే రీతిలో బాబుగారు....మాయా దర్పణంలో చూపిస్తోన్న భ్రమరావతికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇక, ఇప్పటికే వందల కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసిన తాత్కాలిక సచివాలయం - అసెంబ్లీ - శాసనమండలిల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని నిర్మాణం చేపట్టడంపై జాతీయస్థాయిలో విమర్శలు వెల్లువెత్తినా....బాబుగారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నదుల ఒడ్డున కట్టడాలు నిర్మించడం ఎంత ప్రమాదకరమో ఉత్తరాఖండ్ వంటి ఉదంతాలు వార్నింగ్ బెల్స్ మోగిస్తోన్నా....బాబుగారు మాత్రం మోనార్క్ మాదిరి....ఆ విధంగా ముందుకు పోతూ ఉన్నారు. ఇక, కొద్ది రోజుల క్రితం ప్రతిపక్ష నేత జగన్ చాంబర్ లో వర్షపు నీరు చేరిన ఘటన, సచివాలయం ముందు భాగం జలమయమైన ఘటనలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా, నేడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా...బాబు అసమర్థతను ఎత్తి చూపుతూ బీజేపీ నేతలు `గొడుగు`లు పట్టుకొని - జెర్కిన్ లు వేసుకువచ్చారు.
అయితే, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీజేపీ....గతంలో జగన్ చాంబర్ లోకి నీరు వచ్చినపుడు టీడీపీకి మిత్రపక్షంగా ఉన్నారు. ఆ సమయంలో టీడీపీకి మద్దతు పలికిన కమలనాథులు....ఇపుడు మిత్రబంధం తెగిపోగానే....టీడీపీని ఎద్దేవా చేయడం విడ్డూరంగా ఉంది. అపుడు బీజేపీకి దొరకని గొడుగులు ఇపుడు ఎలా దొరికాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆనాడు టీడీపీకి గొడుగు పట్టిన కమలనాథులు....నేడు టీడీపీకి వ్యతిరేకంగా గొడుగులు పట్టుకుని రావడం పలువురిని విస్మయపరిచింది. ఆనాడు టీడీపీపై వైసీపీ విమర్శలుగుప్పిస్తోన్న సందర్భంలో బీజేపీ ప్రేక్షక పాత్ర వహించింది. ఈనాడు తమ స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీకి వ్యతిరేకంగా గొడుగులు తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆనాడే వైసీపీకి మద్దతుగా 'గొడుగుల' నిరసన చేసి వుంటే.. పరిస్థితి ఇంకోలా వుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఏ ఎండకా `గొడుగు` పట్టడం బీజేపీని చూసే నేర్చుకోవాలని విమర్శలు వస్తున్నాయి.