ఎమ్మెల్యేలు వ‌ర్సెస్ ఎంపీలు.. వైసీపీలో వివాదం..!

Update: 2021-08-10 03:22 GMT
ప్ర‌స్తుతం తెర‌మీదికి వ‌చ్చిన నెల్లూరు వివాదం.. వైసీపీలో కాక‌రేపుతోంది. స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ న్ రెడ్డికి.. ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి మ‌ధ్య తీవ్ర వివాదం నెల‌కొంది. స‌ర్వేప‌ల్లిలో అక్ర‌మ గ్రావెల్ త‌వ్వ‌కాల వ్య‌వ‌హారం తీవ్ర వివాదానికి దారితీసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అధి కారుల ఫిర్యాదు మేర‌కు ఎంపీ మాగుంటపై పోలీసులు  కేసు న‌మోదు చేసి, ఏ-2గా మాగుంట‌ను పేర్కొన్నా రు. నిజానికి.. ఈ విష‌యంతో త‌న‌కు సంబంధం లేద‌ని మాగుంట ఇప్ప‌టికే అధికారుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు స‌మాచారం.

అయితే.. ఈ విష‌యంలో వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఉన్నార‌ని.. ఆయ‌న ప్ర‌మేయంతోనే మాగుం టపై కేసు న‌మోదైంద‌ని.. టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి బాంబు పేల్చా రు. దీంతో ఈ వివాదం యూట‌ర్న్ తీసుకుంది. ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే మ‌ధ్య నెల‌కొన్న వివాదం తెర‌మీద‌కి వ‌చ్చింది. వాస్త‌వానికి నెల్లూరు జిల్లాకు చెందిన కాకాణికి, ప్ర‌కాశంజిల్లా ఒంగోలుకు చెందిన మాగుంట‌కు మ‌ధ్య వివాదం రేగ‌డం ఏంటి? అస‌లు ఏం జ‌రిగింది? అనే చ‌ర్చ వైసీపీలో జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఎమ్మెల్యే వ‌ర్సెస్ ఎంపీ వివాదాలు.. వైసీపీలో ష‌రా మామూలే అన్న‌ట్టుగా మారాయి.

దాదాపు అన్ని జిల్లాల్లోనూ.. ఎంపీలు-ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య సుహృద్భావ వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అనంత‌పురం నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు వైసీపీ ఎంపీలు-ఎమ్మెల్యేలు ఆధిప త్య ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని.. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య వివాదాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. అనంత‌పు రం ఎంపీ త‌రాలి రంగయ్య వ‌ర్సెస్ ఎమ్మెల్యే ఉష‌శ్రీచ‌ర‌ణ్ (క‌ళ్యాణ‌దుర్గం)ల‌కు ప‌డ‌డం లేదు. గుంటూరు జిల్లా న‌ర‌స‌రావు పేట ఎంపీ లావు కృష్ణ‌దేవ‌రాయ‌లు వ‌ర్సెస్ చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీ స‌హా ప‌లువురు ఎమ్మెల్యేల‌కు కూడా పొస‌గ‌డం లేదు. కృష్ణాజిల్లా మ‌చిలీప‌ట్నం ఎంపీ బాల‌శౌరి వ‌ర్సెస్ పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌ల‌కు మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతున్నాయి.

అదేవిధంగా తూర్పు గోదావ‌రిజిల్లా రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్‌కు తుని ఎమ్మెల్యేకు మ‌ధ్య యుద్ధం ఇంకాకొన‌సాగుతోంది. విశాఖ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌కు, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌కు మ‌ధ్య మాట‌లు లేవు. క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతోంది. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీల‌కు ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. అయితే.. స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే రేంజ్‌లో ఎవ‌రూ బ‌య‌ట‌ప‌డ‌క‌పోయినా.. ఇవ‌న్నీ నివురు గ‌ప్పిన నిప్పు మాదిరిగానే ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇప్ప‌టికైనా.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఆయా స‌మ‌స్య‌ల‌ను స‌ర్దుబాటు చేస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News