కాల్ మ‌నీ ఎఫెక్ట్‌:టీడీపీ ఎమ్మెల్సీ సోద‌రుడి అరెస్టు

Update: 2015-12-15 10:05 GMT
విజ‌య‌వాడ‌లో వెలుగులోకి వ‌చ్చిన కాల్ మ‌నీ కేసులో రోజు రోజుకు విస్మ‌య‌క‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు 92 చోట్ల దాడులు చేసి 58 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి ఈ రోజు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న సోద‌రుడు నాగేశ్వ‌ర‌రావును పోలీసులు అరెస్టు చేశారు. అలాగే మ‌రో టీడీపీ కార్పొరేట‌ర్ క‌న‌క‌దుర్గ భ‌ర్త‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ రాకెట్‌లో కార్పొరేట‌ర్ క‌న‌క‌దుర్గ పాత్రపై కూడా పోలీసులు విచారిస్తున్నారు.

 ఇక బుద్ధా వెంక‌న్న సోద‌రుడు నాగేశ్వ‌ర‌రావు కేవ‌లం కాల్ మ‌నీ ద్వారా రూ.300 కోట్లు సంపాదించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. విజ‌య‌వాడ న‌గ‌రం మొత్తం మీద మొత్తం రూ.2వేల కోట్ల ఆస్తులు కాల్ మ‌నీ వ్యాపారం చేసే వారి వ‌ద్ద ఉన్నాయ‌ని స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారి నుంచి భారీగా ఖాళీ ప్రామిస‌రీ నోట్‌ లు - చెక్‌ లు స్వాధీనం చేసుకున్నారు. ఓ వైపు ఇంత హ‌డావిడి జ‌రుగుతున్నా కొంద‌రు వ‌డ్డీ వ్యాపార‌స్తులు త‌మ పేర్లు పోలీసుల‌కు చెపితే మీ అంతు చూస్తాం అంటూ బాధితుల‌ను బెదిరిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

 రీసెంట్‌ గా కాల్ మ‌నీకి సంబంధించి మ‌రో న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ రాకెట్‌ తో టీడీపీకి చెందిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజు పేరు కూడా తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆయ‌న త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన పెండ్యాల శ్రీకాంత్ ద్వారా రూ.కోటి వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్టించిన‌ట్టు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. కాల్ మ‌నీ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్నాడు. అయితే పోలీసులు మాత్రం శ్రీకాంత్ ప‌ట్టుబ‌డితేనే బాపిరాజు పాత్ర ఈ కేసులో ఉన్న‌ది లేనిది నిర్దార‌ణ కాద‌ని చెపుతున్నారు. అలాగే కేసు ద‌ర్యాప్తు వేగంగా కొన‌సాగుతుండ‌గా విజ‌య‌వాడ న‌గ‌ర క‌మిష‌న‌ర్ గౌత‌మ్‌ స‌వాంగ్ సెల‌వుపై వెళ్ల‌డంతో అధికార పార్టీనేత‌ల నుంచి ఆయ‌న‌పై భారీగా ఒత్తిళ్లు వ‌చ్చాయ‌ని కూడా విజ‌య‌వాడ టాక్‌.
Tags:    

Similar News