హిందూపురం వైసీపీ లో చిచ్చు రాజుకుంది! గత ఎన్నికల్లో ఇక్కడి నుండి గెలిచిన నందమూరి బాలకృష్ణ పై వైసీపీ తరఫున ఇక్బాల్ పోటీ చేసి ఓడిపోయారు. ఇక్బాల్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈయనపై సొంత పార్టీ నాయకులు ఒకరు తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ తనను కొట్టారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని అభివృద్ధి పనులకు సంబంధించి ప్రశ్నించినందుకు దాడి చేశారని చెబుతున్నారు. ఈ దాడిలో ఆయన ముఖానికి గాయమైందని చెబుతున్నారు.
ఇటీవల ప్రభుత్వం కేటాయించిన పనులకు సంబంధించి తమ గ్రామంలో స్థానికంగా ఉన్న నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వేరే వ్యక్తులు వచ్చి పనులు చేపట్టారని హనుమంతరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఇక్బాల్‌ను ప్రశ్నించేందుకు హనుమంతరెడ్డి ఆయన ఆఫీస్‌కు వెళ్లారు. తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని అడగడానికి వెళ్తే దాడి చేశాడని చెబుతున్నారు.
ఈ పనులకు సంబంధించి అన్ని అంశాలు మాట్లాడుతామని తాను చెబుతుండగా, ఇక్బాల్ తన మొహంపై దాడి చేశారని బాధిత హనుమంతరెడ్డి ఆరోపిస్తున్నారు. తనలాంటి వ్యక్తులు పార్టీకి అవసరం లేరని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడికి సంబంధించిన అంశాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు.
దీనిపై హనుమంతరెడ్డి తాను వైసీపీ లో ఓ బాధ్యతాయుతమైన పదవి లో ఉన్నానని, కాబట్టి తనకు ఇక్బాల్ సమాచారం ఇవ్వాలని కోరుకున్నానని, అలా కోరుకోవడంలో తప్పులేదన్నారు. తాను మొదట ఫోన్ చేస్తే సరైన విధంగా స్పందించలేదని, దీంతో గురువారం సాయంత్రం వెళ్లానని చెప్పారు. పార్టీ అంశాన్ని పక్కన పెడితే ఆయన ప్రజా ప్రతినిధి కాబట్టి తమ గ్రామంలోని వర్క్స్ గురించి అడిగేందుకు వచ్చానని చెప్పారు.
ఇక్బాల్ వంటి నాయకులతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆయన వాపోయారు. పార్టీ వ్యక్తులను, క్యాడర్ ఉన్న తనలాంటి వారినే కొడుతున్నారని అంటే అర్థం చేసుకోవాలన్నారు. అంటే ఇతరులపై దాడి చేస్తే బయటకు రాని వారు ఎంతోమంది ఉండి ఉంటారన్నారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదన్నారు. దీనిని సీఎం జగన్ దృష్టిలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇక్బాల్ వంటి వ్యక్తిని తప్పించాలని తాము జగన్‌కు విజ్ఞప్తి చేస్తున్నామని, హిందూపురం ఇంచార్జి బాధ్యతలను మరో వ్యక్తికి అప్పగించాలని కోరారు. రాజకీయాలు చేసేవారికి, ప్రజలను మెప్పించే వారికి బాధ్యతలు అప్పగించాలని, కానీ బ్లాక్ మెయిల్ చేసే వారికి, బెదిరించే వారికి ఇవ్వవద్దని ఆయన కోరారు.