కౌరవుల పక్షాన కర్ణుడు.. రాజగోపాల్ రెడ్డి: జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్

Update: 2022-08-08 13:49 GMT
మహాభారతంలో కర్ణుడిలా పాండవులును వీడి కౌరవుల పంచన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆయన ఓటమి ఖాయం అని హాట్ కామెంట్స్ చేశఆరు. ఇక ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టడం అనేది జరగదని కామెంట్ చేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత సీఎల్పీ అత్యవసరంగా సమావేశమైంది. మునుగోడు ఎన్నికల్లో గెలుపుపై జీవన్ రెడ్డి మాట్లాడారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తే ఇమేజ్ పెరుగుతుందని.. కాంగ్రెస్ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెస్ అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

పోరాటం చేయడంలో తప్పు లేదని.. అది పార్టీలో ఉండి చేయవచ్చని.. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వద్దనదని జీవన్ రెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డి పార్టీలో ఉండి పోరాడితే బాగుండేదన్నారు. పోరాడే అవకాశాలు ఎన్నివచ్చినా రాజగోపాల్ రెడ్డి వినియోగించుకోలేదని వివరించారు. పోరాడానికే రాజీనామా చేస్తున్నానని చెప్పడంలో అర్థం లేదని కొట్టి పారేశారు.

భట్టి విక్రమార్క ఎంత చెప్పినా రాజగోపాల్ వినలేదని జీవన్ రెడ్డి వాపోయారు. కొన్ని సంచలన తెరవెనుక నిజాలు బయటపెట్టారు. కాంగ్రెస్ లో 'పంచ పాండవులు' మాత్రమే మిగిలారని.. పంచ పాండవుల్లో సీఎల్పీ నేత భట్టి ధర్మరాజు అని జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక జగ్గారెడ్డి భీముడు, శ్రీధర్ బాబు అర్జునుడు అంటూ ఆకాశానికి ఎత్తే శాడు. నకులుడు, సహదేవుడి గురించి మాత్రం వివరించలేదు.

రాజగోపాల్ కన్విన్స్ గా రాజీనామా చేయలేదని జీవన్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తానని రాజగోపాల్ అనడంపై జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి అలా అనడం చేతగానితనమేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పోరాడే అవకాశం ఇచ్చినా రాజగోపాల్ రెడ్డి ఉపయోగించుకోలేదని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మూడేళ్లలో రాజగోపాల్ రెడ్డి ప్రజల కోసం చేసిన ఉద్యమం ఏమన్నా ఉందా?అంటూ ప్రశ్నించారు.
Tags:    

Similar News