కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పార్టీలను వ్యూహాత్మకంగా దెబ్బ తీసిన గులాబీదండు ఇప్పుడు తమ ఫోకస్ మొత్తాన్ని కాంగ్రెస్ మీద పెట్టింది. గత సార్వత్రిక ఎన్నికల వేళలో ఉన్న పార్టీల్లో ఒక్క కాంగ్రెస్ తప్పించి.. టీఆర్ఎస్ కు ప్రత్యర్థులన్న వారే లేని పరిస్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక్క ప్రత్యర్థిపైనా అధిక్యతను ప్రదర్శిస్తే తమకు తిరుగు లేదన్న ఆలోచనలో గులాబీ బ్యాచ్ ఉంది. ఇందుకు తగ్గట్లే మాటల దాడిని అంతకంతకూ పెంచుతున్నారు. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో తెలిసిందే. కేసీఆర్ మాత్రమే కాదు.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇదిలా ఉంటే.. తమ అధినేతపై టీఆర్ ఎస్ ముఖ్యనేతలు చేస్తున్న విమర్శల్ని తిప్పి కొట్టే క్రమంలో కాంగ్రెస్ నేతలు చెలరేగిపోతూ.. కేసీఆర్.. కేటీఆర్ లపై విరుచుకుపడుతున్నారు. దీంతో గులాబీ దళం రంగంలోకి దిగింది. తమ నేతల్ని తిడుతున్న కాంగ్రెస్ నేతల మాటలకు కౌంటర్ ఇస్తున్నారు.
ఇప్పుడు అదే తరహాలో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ రాములు నాయక్. మంత్రి కేటీఆర్ ను బచ్చా అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శల్ని తప్పు పడుతూ.. కేటీఆర్ బచ్చా కాదని.. మంత్రిగా అచ్చా అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ప్రధాని మోడీని కౌగలించుకొని కన్ను కొట్టిన రాహుల్ బచ్చా అన్న ఆయన.. అమెరికాలో ఉద్యోగం వదిలేసి ఉద్యమంలో కేటీఆర్ పని చేశారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జేబులు నింపుకోవటం.. ఆస్తులు సంపాదించుకోవటం తప్పించి ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. మొత్తానికి కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఏమో కానీ.. కేటీఆర్ మనసును దోచుకునేలా మాట్లాడటంలో మాత్రం ఎమ్మెల్సీ రాములు నాయక్ సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.