ఫ్యాన్సీ నెంబరు కోసం టీడీపీ ఎమ్మెల్సీ ఆరాచకం

Update: 2017-01-20 06:05 GMT
ఇప్పటివరకూ భూముల కోసం.. విలువైన ఆస్తుల కోసం.. భారీ టెండర్ల కోసం రాజకీయ నాయకులు బెదిరింపులకు దిగటం చూస్తున్నదే. తాజా ఉదంతం గురించి వింటే షాక్ తినాల్సిందే. రాజకీయనేతల స్థాయి తగ్గిందో.. లేక.. వారి దౌర్జన్యాలు మరీ శ్రుతిమించుతున్నాయా? అన్న భావన కలిగే వైనమిది. తన కారుకు అవసరమైన ఫ్యాన్సీ నెంబరు కోసం ఏపీలోని ఒక ఎమ్మెల్సీ అనుచరులు చేసిన రచ్చ ఇప్పుడు సంచలనంగా మారింది.

తరచూ టీవీ డిబేట్లలో దర్శనమిస్తూ.. ఉపన్యాసాలు దంచేస్తూ.. విలువల గురించి మా గొప్పగా చెప్పేసే యలమంచిలి బాబురాజేంద్ర ప్రసాద్ అనుచరుల తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమ నేత వాహనానికి అనుకున్న ఫ్యాన్సీ నెంబరు కోసం పోటీ పడతావా? ఎంత ధైర్యం? అంటూ వారు ఇస్తున్న హెచ్చరికలు వింటుంటే నోటమాట రాని పరిస్థితి.

ఉయ్యూరు ఆర్డీవో కార్యాలయంలో ఏపీ 16 డీడీ 7777 నెంబరు కోసం ఇరువురు పోటీ పడ్డారు.వీరిలో ఒకరు అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అనుచరుడు ప్రవీణ్ కుమార్ కాగా.. మరొకరు వినయ్ కుమార్. ఫ్యాన్సీ నెంబరు కోసం వారిరువురూ పోటాపోటీ పడటం ఓకేఅయినా.. ఆ నెంబర్ ను సొంతం చేసేందుకు ఎమ్మెల్సీ అనుచరుడు బెదిరింపుల పర్వానికి తెర తీయటం గమనార్హం.

ఫ్యాన్సీ నెంబరు కోసం ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన వినయ్ కుమార్ పై ఎమ్మెల్సీ అనుచరులు బెదిరింపులకు దిగారు. ఈ వ్యవహారాన్ని మొబైల్ లో షూట్ చేసే ప్రయత్నం చేయగా.. ఫోన్లో మాట్లాడిన బాబు రాజేంద్రప్రసాద్.. రవివర్మపైతీవ్ర పదజాలంలో తిట్టేసినట్లుగా చెబుతున్నారు. తనలాంటివీఐపీకి ఫ్యాన్సీ నెంబరు కావాలని కానీ.. లేబర్ వాడికి కాదు.. మరోసారి ఎవరినైనా కొట్టేటప్పుడు మళ్లీ మొబైల్లో రికార్డు చేసుకో అంటూ తీవ్రస్థాయిలో టీడీపీ ఎమ్మెల్సీ వార్నింగ్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఫ్యాన్సీ నెంబరు కోసం మరీ ఇంత ఆరాచకమా? అని ఈ వ్యవహారం గురించి తెలిసిన వారంతా అవాక్కు అయ్యే పరిస్థితి.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News