టెకీల‌కు గుడ్‌ న్యూస్‌..ఎంఎన్‌ సీల్లో ఉద్యోగాల జాత‌ర‌

Update: 2017-08-17 12:51 GMT
వ‌రుస చేదువార్త‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న టెకీల‌కు భారీ తీపిక‌బురు వ‌చ్చింది. వేల సంఖ్య‌లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని మ‌ల్టినేష‌న‌ల్ కంపెనీలు ప్ర‌క‌టించాయి.  ఓవైపు ఇండియ‌న్ ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్నార‌న్న ఆందోళ‌న‌ల మ‌ధ్య సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌ కి మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీలు (ఎమ్మెన్సీ) మాత్రం గుడ్‌ న్యూస్ చెబుతున్నాయి. అసెంచ‌ర్‌ - క్యాప్‌ జెమిని - ఒరాకిల్‌ - ఐబీఎమ్‌ - గోల్డ్‌ మాన్ స‌చ్స్‌ లాంటి కంపెనీలు వేల మంది ఉద్యోగుల కోసం చూస్తున్నాయి. ఒక్క అసెంచ‌ర్‌ లోనే అదీ ఇండియాలో 5396 జాబ్స్ ఉన్నాయి. ఈ కంపెనీ విష‌యానికి వ‌స్తే అమెరికాలో కంటే నాలుగు రెట్లు ఎక్కువ‌గా ఇండియాలోనే జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి.

ఇక ఫ్రెంచ్ ఐటీ కంపెనీ క్యాప్‌ జెమినీలోనూ 2649 జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. ఆ సంస్థ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇస్తున్న ఉద్యోగాల్లో ఇవి 55 శాతం కావ‌డం విశేషం. ఇక ఒరాకిల్ ఇండియాలో 1124 జాబ్ ఆఫ‌ర్స్ ఇస్తున్న‌ది. అటు ఈ-కామ‌ర్స్ జెయింట్ అమెజాన్‌ లో 1208 జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి.

ఐబీఎంలో 675 - గోల్డ్‌ మాన్ స‌చ్స్‌ లో 320 - డెల్‌ లో 285 - మైక్రోసాఫ్ట్‌ లో 235 - సిస్కోలో 229 - ఫ్రెంచ్ బ్యాంక్ సొసైట్ జెన‌ర‌ల్‌ లో 185 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇండియాలోని ఎంఎన్‌ సీలు 10 శాతం వృద్ధితో దూసుకెళ్తున్నట్లు నాస్కామ్ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం 7 ల‌క్ష‌ల 70 వేల ఉద్యోగులు ఈ కంపెనీల్లో ప‌నిచేస్తున్నారు. అటు క‌న్సెల్టెన్సీ సంస్థ జిన్నోవ్ మాత్రం ఇండియాలో మొత్తం 1150 ఎంఎన్‌ సీలు ఉన్నాయ‌ని - వీటిల్లో 8 ల‌క్ష‌ల 15 వేల మంది ఉద్యోగులు ఉన్న‌ట్లు అంచ‌నా వేసింది. ఈ ఏడాది వీటికి మ‌రో 30 వేల ఉద్యోగాల‌ను అద‌నంగా చేర్చ‌నున్నాయి ఈ ఎంఎన్‌ సీలు. ఎంఎన్‌ సీల్లో 35 శాతం బెంగ‌ళూరులో ఉండ‌గా.. 15 శాతం ఎన్‌ సీఆర్‌ లో ఉన్నాయి. ఇండియాలో ఐటీ జెయింట్స్ అయిన టీసీఎస్‌ - కాగ్నిజెంట్‌ - ఇన్ఫోసిస్‌ - టెక్ మ‌హీంద్ర వేల సంఖ్య‌లో ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న నేప‌థ్యంలో.. ఎంఎన్‌ సీల్లో ఉద్యోగాల జాత‌ర సాఫ్ట్‌ వేర్ ఎంప్లాయీస్‌ కి క‌లిసొచ్చేదేన‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు అంటున్నాయి.
Tags:    

Similar News