చంద్రబాబుపై మోహన్ బాబు... ఎక్కి దిగేశారబ్బా

Update: 2019-11-04 15:33 GMT
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిజంగానే ఇప్పుడు అనవసరంగా ఓ వ్యాఖ్య చేసి బాగానే దెబ్బైపోయారని చెప్పక తప్పదు. అసలే ఎంట్రీ ఇస్తే... అంతు చూసే దాకా వదలని వ్యక్తిగా పేరున్న సినీ నటుడు, మాజీ ఎంపీ, వైసీపీ నేత మంచు మోహన్ బాబును కెలికితే ఎలా ఉంటుందో కూడా ఇప్పుడు బాబుకు బాగానే అనుభవంలోకి వచ్చిందన్న విషయం ఆసక్తికరంగా మారిపోయింది. ఒకప్పుడు చంద్రబాబు, మోహన్ బాబు ఒకే తానులో ముక్కలుగానే ఉన్నా... ఇద్దరి దారులు వేరయ్యాక వీరిద్దరి మధ్య నిజంగానే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారిపోయింది. ఇలాంటి సమయంలో మోహన్ బాబును కెలికేసిన చంద్రబాబు నిజంగానే అడ్డంగా బుక్కైపోయారు.

తన క్రమశిక్షణ గురించి చంద్రబాబు మాట్లాడగానే... మోహన్ బాబు ఓ రేంజిలో ఎంట్రీ ఇచ్చారు. చంద్రబాబును ఇప్పటిదాకా ఏ ఒక్కరూ అనని రీతిలో మోహన్ బాబు ఏకిపారేశారు. క్రమశిక్షణ, స్నేహం అనే పదాలకు అర్థం తెలియని నేత దేశంలో ఎవరైనా ఉన్నారంటే... అది ఒక్క చంద్రబాబేనని మోహన్ బాబు కాస్తంత ఘాటు వ్యాఖ్యలే చేశారు. అంతేకాకుండా తనతో పెట్టుకుంటే... తడిసిపోద్దని కూడా మరింత కటువైన పదజాలంతో చంద్రబాబును మోహన్ బాబు ఓ రేంజిలో వేసుకున్నారని చెప్పక తప్పదు. దారులు వేరైనా ఎక్కడైనా ఎదురుపడితే పలకరించుకుందామని, అది కూడా తమరికి ఇష్టమైతేనే పలకరించుకుందామని, లేదంటే అది కూడా వద్దంటూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.

అయినా చంద్రబాబు వర్సెస్ మోహన్ బాబు వివాదం ఎలా మొదలైందన్న విషయానికి వస్తే... ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. మోహన్ బాబు గురించి ప్రస్తావించారు. మోహన్ బాబు క్రమశిక్షణ లేని వ్యక్తి అంటూ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలు చెవినబడినంతనే మోహన్ బాబు బరస్ట్ అయిపోయారు. సోషల్ మీడియా వేదికగా... చంద్రబాబును టార్గెట్ చేసిన మోహన్ బాబు... ఓ రేంజిలో... ‘‘చంద్రబాబు ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.అంతా ప్రశాంత వాతావరణం. ఈ సమయంలో మళ్ళీ ఇలా నా మనసును ఇబ్బంది పెడతావు అనుకోలేదు. రెండు రోజుల క్రితం క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని నీ నోటి నుండి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నా మనసును గాయపరిచావు. అన్న యన్. టి. ఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు నా సినిమా పరిశ్రమ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మోహన్ బాబు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు, చెప్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే. దయ చేసి ఏ సందర్భంలోనూ నా పేరుకు భంగం కలిగించేటట్టు ప్రస్తావించకు. అది నీకు నాకు మంచిది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురు పడితే సరదాగా మాట్లాడుకుందాం, అదీ నీకు ఇష్టమైతే. ఉంటా!’’ అని సోషల్ మీడియాలో మోహన్ బాబు కామెంట్లు చేశారు
Tags:    

Similar News