అరుణా చల్ ప్రదేశ్ లో చిన్నారులపై వరుస హత్యలు కలవరానికి గురిచేస్తున్నాయి. కూలీలుగా వచ్చిన మృగాళ్లు అభంశుభం తెలియని చిన్నారుల్ని అత్యాచారం ఆపై హత్యలు చేసి భయాందోళనకు గురిచేస్తున్నారు. ఆ రెండు జిల్లాల మధ్య వరుసగా రెండో సారి చిన్నారిని హత్య చేయడంతో స్థానికులు నిందితుల్ని నడిరోడ్డుపై కొట్టి చంపారు.అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులకు ఇలాంటి శిక్షే కరెక్టేనని అంటున్నారు.
లోహిత్ జిల్లాలో వాక్రో సర్కిల్‌లోని నామ్ గో గ్రామంలో అరున్ క్రి ఐదు సంవత్సరాల కూతురు జ్ఞాన్ సరోవర్ అకాడమీలో చదువుతుంది. అయితే ఫిబ్రవరి 12 - 2018న తన కూతురు కనిపించడంలేదని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అదే రోజు సాయంత్రం నామ్ గో గ్రామం సమీపంలో ఉన్న తేయాకు తోటల్లో ఒంటిపై నూలు పోగులేకు రక్తం మడుగులో జీవశ్చవంలా పడి ఉంది. ఆ చిన్నారి ని చూసిన పోలీసులు అత్యాచారం చేసి - హత్య చేశారని నిర్ధారణకు వచ్చారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో తేయాకు తోటల్లో పనిచేసే అస్సాంకు చెందిన కూలీలు సంజయ్ సబర్(30) - జగదీశ్ లోహర్(25)లుగా గుర్తించి అరెస్ట్ చేశారు.
ఈ దుర్ఘటనకు ముందే ఆ ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో జిల్లాలో దారుణం జరిగింది. నామ్ సాయి జిల్లాల్లో గత ఏడాది డిసెంబర్ 23న 13ఏళ్ల విద్యార్ధి మిషనరీ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతుంది. అయితే ఆ చిన్నారి చోంగ్ ఖాం అనే ప్రాంతంలో ఆ చిన్నారి మృతదేహం చెట్ల పొదల్లో ప్రత్యక్షమైంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆ చిన్నారిని మృతదేహాన్ని స్వాదీనం చేసుకొని పోస్ట్ మార్టం కు తరలించారు. అయితే ఆ చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేశారని పోలీసుల నిర్ధారణలో తేలింది. ఈ దుర్ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే లోహిత్ జిల్లా చిన్నారి అత్యాచారం కేసులో జైలులో ఉన్న తేయాకు కూలీల్ని స్థానిక గ్రామస్థులు నిందితులు తేజూ పోలీస్ స్టేషన్ లో ఉన్న విషయం తెలుసుకున్నారు. ఉన్నతాధికారులు లేని సమయంలో కర్రలు - కటార్లతో స్టేషన్‌పై దాడి చేశారు. అయితే వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇద్దరినీ బయటకు లాక్కొచ్చి నడిరోడ్డు మీద నిలబెట్టి నగ్నంగా మార్చారు. ఆపై రాళ్లు - కర్రలతో కొట్టి చంపేశారు
కాగా ఈ ఘటనపై అరుణాచల్ ప్రదేశ్ సీఎం ప్రేమ ఖండూ ముగ్గురు అధికారులు - ఎస్పీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఖండూ ప్రభుత్వం ఘటనపై మెజిస్టేరియల్ విచారణకు ఆదేశించింది.