అదేదో సినిమాలో ఫోన్ రింగ్ కావటం.. ఎక్కడి నుంచో అన్నది ఒక పట్టాన అర్థం కాదు. చివరకు కడుపులో నుంచి రింగ్ టోన్ రావటాన్ని గుర్తించి అవాక్కు అవ్వటమే కాదు.. మనసారా నవ్వుకుంటారు. ఈ కామెడీ సీన్ రియల్ లైఫ్ లో నిజంగానే చోటు చేసుకుంది. తీహార్ జైల్లో విచారణలో ఉన్న ఒక ఖైదీని కోర్టుకు తీసుకెళ్లి తిరిగి జైలుకు తీసుకొచ్చారు.
సదరు ఖైదీని చెక్ చేస్తున్నప్పుడు.. ఫోన్ రింగ్ టోన్ వినిపించింది. వెంటనే.. అలెర్ట్ అయిన అధికారులు అతన్ని క్షుణ్ణంగా పరీక్షించారు. అయినప్పటికీ అతడి నుంచి ఎలాంటి ఫోన్ దొరకలేదు. దీంతో.. తల పట్టుకున్న అధికారులకు షాకింగ్ నిజం తెలిసిందే. సదరు ఖైదీ చిన్నదైన ఫోన్ ను మింగేశాడని.. కడుపులో నుంచి రింగ్ టోన్ వినిపించిన విషయాన్ని గుర్తించారు.
వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించి.. ఫోన్ ను బయటకు తీశారు. అయితే.. ఫోన్ తో పాటు.. ఛార్జర్ లీడ్ ను కూడా మింగగా.. అది మాత్రం బయటకు తీయలేకపోయారు. తీహర్ జైల్లోని నాలుగో నెంబరు జైల్లో ఈ ఉదంతం చోటు చేసుకుందని.. సదరు ఖైదీ గతంలోనూ జైల్లోకి ఫోన్ తీసుకెళ్ల క్రమంలో దొరికిపోయినట్లు చెబుతున్నారు. రీల్ సీన్లు రియల్ గానూ చోటు చేసుకోవటం అంటే ఇదేనని చెప్పాలి.