అతడేమీ అల్లాటప్పా వ్యక్తి కాదు. బాలీవుడ్ బాద్షా షారుక్ కుమారుడు. అయితే.. అతగాడు కూడా చిన్న తప్పేం చేయలేదు. నిషేధిత డ్రగ్స్ తో సహా పట్టుబడినట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే.. ఈ వాదనను షారుక్ తరఫు న్యాయవాదులు మాత్రం అంగీకరించటం లేదు. అధికారులు సోదాలు నిర్వహించిన సమయంలో ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి నిషేధిత డ్రగ్స్ లభ్యం కాలేదని కోర్టులో వాదిస్తూ.. బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే.. ఆర్యన్ ఖాన్ మొబైల్ ఇప్పుడాయనకు శాపంగా మారిందని చెబుతున్నారు. అతడి మొబైల్ లోని వాట్సాప్ లో పలువురు డ్రగ్స్ డీలర్లతో సంభాషణలు ఇప్పుడు అతని కొంప ముంచుతున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా ఆర్యన్ బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగిన సమయంలో.. అతగాడు తరచూ డ్రగ్స్ తీసుకునేవాడని ఎన్ సీబీ టీం వెల్లడించగా.. అందుకు భిన్నమైన వాదనను వినిపించారు ఆర్యన్ తరఫు లాయర్లు వాదిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఎన్ సీబీ అధికారులు ఆర్యన్ మొబైల్ లోని వాట్సాప్ ఛాట్ ను ఆధారంగా చూపిస్తూ.. అతనికి డ్రగ్స్ రాకెట్ లో అతనికున్న సంబంధాల గురించి వాదిస్తున్నారు. విదేశీ డ్రగ్స్ పెడ్లర్లతోనూ సంబంధాలు ఉన్నాయని.. అందుకు తగ్గట్లే అతని వాట్సాప్ ఛాట్ జరిగిన విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. దీంతో.. కేసు మరింత బిగుసుకున్నట్లు చెబుతున్నారు. ఏతా వాతా చూస్తే.. ఆర్యన్ మొబైల్ అతన్ని మరింత ఇరుక్కుపోయేలా మారిందన్న మాట వినిపిస్తోంది. తాజా బెయిల్ పిటిషన్ పై తన తీర్పును కోర్టు ఈ నెల 20కు రిజర్వు చేసిన నేపథ్యంలో.. అప్పుడు కానీ బెయిల్ మంజూరు కాకుంటే.. కనుచూపు మేర బెయిల్ రావటం కష్టమన్న మాట వినిపిస్తోంది. ఆర్యన్ మొబైల్ ఎంతపని చేసింది?