ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన మోడల్ కమ్ ఎయిర్ హోస్టెస్ గడిచిన కొద్దికాలంగా చిత్తూరు జిల్లా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తనను అదుపులోకి తీసుకునేందుకు చిత్తూరు పోలీసులకు చుక్కలు కనిపించేలా చేసిన ఆమె.. జైల్లో టాయిలెట్ క్లీనర్ తాగి సూసైడ్ అటెంప్ట్ చేయటం షాకింగ్ గా మారింది. ఇంతకూ ఆమె సూసైడ్ ఎందుకు చేసుకుంది? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఆమె సూసైడ్ చేసుకోవటానికి వీలు కల్పించిన టాయిలెట్ క్లీనర్ ఎలా చేతికి వచ్చిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారాల్లో తన భర్త జైల్లోకి వెళ్లిన తర్వాత వ్యాపార బాధ్యతల్ని చేపట్టటమే కాదు.. అతి తక్కువ కాలంలో సంగీత తన మార్క్ ను ప్రదర్శించారని చెబుతారు. అక్రమ రవాణాను మొయింటైన్ చేయటం అంత తేలికైంది కాదు. కానీ.. ఎలాంటి ఇబ్బంది పడకుండా వ్యాపారాన్ని మరింత పెంచటమే కాదు.. వారెంట్ తీసుకొని వచ్చిన చిత్తూరు జిల్లా పోలీసులకు ముప్పతిప్పలు పెట్టి.. మూడు చెరువులు తాగించింది.
ఒకసారి ఆమెను చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంటనే దాదాపు యాభై వరకు లాయర్లు రంగంలోకి దిగి ఆమెకు బెయిల్ వచ్చేలా చేయటంతో.. ఆమె రేంజ్ ఏమిటో అందరికి అర్థమైన పరిస్థితి. మరింత నెట్ వర్క్.. ఇంత బలం ఉన్న సంగీత జైల్లో అంత పిరికిగా సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసినట్లు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
కొన్ని వర్గాల సమాచారం ప్రకారం.. జైల్లో సంగీతకు ఎదురైన పరిస్థితులేనని చెబుతున్నారు. ఎయిర్ హోస్టెస్.. మోడల్ గా పని చేసి తర్వాతి కాలంలో రెడ్ శాండిల్ క్వీన్ గా అండర్ వరల్డ్ లో పాపులర్ అయిన ఆమె.. జైల్లో వేధింపులకు గురి అవుతున్నట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఒకసారి ఆమె మీడియాతో చెప్పటాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే.. ఇందులో నిజం లేదని.. తప్పుడు ఆరోపణలు చేసి తనపై సానుభూతి వచ్చేలా సంగీత మైండ్ గేమ్ ఆడుతోందని చెబుతున్నారు. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న ఆమె.. జైల్లో తనకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయన్న భావన కలిగించటంతో పాటు.. తనపై వేధింపులు జరుగుతున్నట్లుగా ప్రచారం చేస్తే..తన పట్ల సానుకూలత ఏర్పడే అవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే ఆమె అలా చేసి ఉంటారని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. చిత్తూరు జిల్లా జైల్లోని వాతావరణం కూడా సంగీతను సూసైడ్ చేసుకునేలా చేసిందన్న వాదన ఉంది. ఎందుకంటే.. చిత్తూరు జిల్లా జైల్లో 150 మంది ఖైదీలు ఉంటే వారిలో ఏడుగురే మహిళా ఖైదీలు. వీరిలో ఎవరికి హిందీ రాకపోవటంతో ఆమె తన ఆవేదనను పంచుకోవటానికి తోడు లేకపోవటంతో తీవ్ర ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లుగా తెలుస్తోంది. బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావటంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లుగా చెబుతున్నారు. మోడల్ గా.. ఎయిర్ హోస్టెస్ గా ఒకప్పుడు తన హోదా.. విలాసజీవితం గుర్తుకు వచ్చిన సంగీత.. తన తాజా పరిస్థితికి తీవ్ర ఆవేదన చెంది ఉంటారని.. అదే ఆమెను సూసైడ్ చేసుకునేలా చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక.. సూసైడ్ అటెంప్ట్ కు సంగీతకు టాయిలెట్ క్లీనర్ ఎలా లభించిందన్న విషయానికి వస్తే.. జైల్లో ఆమె కొన్నిరోజుల పాటు బాత్రూంలు కడగాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఆమెకు ఆ పని అప్పజెప్పారు. దీంతో.. బాత్రూం క్లీనర్ గా వాడే యాసిడ్ ను తాగటం ద్వారా సూసైడ్ అటెంప్ట్ చేశారని తెలుస్తోంది.