మోడీ 5 ట్రిలియన్ డాలర్ల కల అసాధ్యం ! ఎందుకంటే ?

Update: 2019-11-22 08:42 GMT
భారత ప్రధానమంత్రిగా  నరేంద్ర మోడీ ఏ ముహూర్తాన ప్రమాణస్వీకారం చేసారో కానీ , బ్రహ్మం గారి కాలజ్ఞానం లాగా చెప్పినవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నిరవేర్చడంతో ...మోడీ నేతృత్వంలోని బీజేపీ వరుసగా రెండోసారి కేంద్రంలో సంపూర్ణమైన మెజారిటీ తో అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత కూడా పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా భారత్ ని పట్టి పండిస్తున్న సమస్యలకి పరిష్కారం చూపించాడు. కానీ , మోడీ కన్న ఒక కల మాత్రం ... తీరేలా లేదు. మోడీ కల తీరడం దాదాపు అసాధ్యం అంటూ నిపుణులు కూడా తేల్చి చెప్తున్నారు. ఇంతకీ మోడీ కల ఏమిటి ? అది ఎందకు తీరదు ? అనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం..

2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చూడాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ , ప్రస్తతం ఉన్న ఆర్థిక మంద గమనం ప్రకారం ఇది దాదాపు అసాధ్యం. ప్రస్తుత జీడీపీ వృద్ధి రేటుతో 2025 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకునే  ప్రసక్తే లేదు అని ఆర్బీఐ మాజీ గవర్నర్ సీ రంగరాజన్ తెలిపారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 2.7 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉందని,  అయితే , వచ్చే ఐదేళ్ల కాలంలో  దీనిని ఐదు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకు వెళ్లాలనుకుంటున్నామని, అది సాధ్యం కావాలంటే జీడీపీ వృద్ధి రేటు ఏటా కనీసం తొమ్మిది శాతం ఉండాలని, ప్రస్తుత ఆర్థిక వృద్ధి రేటు ప్రకారం చూస్తే 2025 నాటికి మన ఆర్థిక వ్యవస్థ ఈ స్థాయికి చేరే ప్రశ్నే లేదని తేల్చేసారు.

భారత ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వం పెట్టుకున్న 5 ట్రిలియన్ డాలర్ల అతిపెద్ద లక్ష్యాన్ని చేరుకుంటే ఒక్కొక్కరి తలసరి ఆదాయం ప్రస్తుతం ఉన్న దాని కంటే రెట్టింపు అవుతుందని రంగరాజన్ చెప్పారు. ప్రస్తుతం మన  వృద్ధిరేటు ఆరు శాతం కంటే తక్కువగా ఉందని, వచ్చే ఏడాది 7 శాతంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అయన తెలిపారు. తలసరి ఆదాయం 12,000 డాలర్లుగా ఉంటే మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చెప్పవచ్చునని. కానీ ,  మనం ఈ స్థాయికి చేరుకోవడానికి కనీసం 22 ఏళ్లు పడుతుందని రంగరాజన్ చెప్పారు. ఇది సాధ్యమౌవ్వాలి అంటే  వృద్ధి రేటు 9 శాతంగా ఉండాలని తెలిపారు.
Tags:    

Similar News