మరో రోజు వ్యవధిలో ప్రధాని మోడీ.. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ లు సమావేశం కానుంది. వీరి మధ్య మీటింగ్ కు తమిళనాడులోని ప్రసిద్ధ టూరిజం ప్రాంతమైన మహాబలిపురంలోని మామల్లాపురం వేదికకానుంది. సమావేశానికి కేవలం 50 గంటల ముందు మాత్రమే.. వివరాల్ని వెల్లడించటం ఒక విశేషమైతే.. వీరి భేటీకి వేదికకు 22 కిలోమీటర్ల దూరంలో ఉండే ఫైవ్ స్టార్ హోటల్ తాజ్ ఫిషర్ మెన్ లో బస చేయనున్నారు.
మోడీ.. జిన్ పింగ్ లు ఒకే చోట బస చేసినా.. సమావేశానికి మాత్రం వేర్వేరు వాహనాల్లో వెళ్లనున్నారు. షెడ్యూల్ ప్రకారం చూూస్తే.. శుక్రవారం మధ్యాహ్నం చెన్నైకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చేరుకుంటారు. అనంతరం ప్రధాని మోడీ ఆయన్ను మామల్లాపురం తీసుకెళ్తారు. అక్కడి సీషోర్ టెంపుల్ లో సమావేశమవుతారు.
అక్కడున్న వెయ్యేళ్ల నాటి చారిత్రక కట్టడాల్ని సందర్శిస్తారు. అనంతరం జిన్ పింగ్ గౌరవార్థం మోడీ విందును ఇవ్వనున్నారు. ఇక.. శనివారం ఇరువురు నేతలు ముఖాముఖిగా సమావేశం కానున్నారు. అనంతరం ఇరు దేశాలకు చెందిన అధికారులతో కలిసి చర్చలు జరుపుతారు. మధ్నాహ్నం రెండు గంటలకు చెన్నైకి తిరిగి వచ్చే చైనా అధ్యక్షుడు అక్కడ నుంచి నేపాల్ కు వెళ్లనున్నారు.
తాజాగా ఇరు దేశాల ముఖ్యఅధినేతల సమావేశం జరుగుతున్న ప్రాంతానికి ఒక విశిష్ఠత ఉంది. రెండువేల సంవత్సరాల క్రితం పల్లవుల కాలంలో అప్పటి చైనా రాజు వి.. తమ దేశ వర్తకులను ఇదే ప్రాంతానికి పంపుతారు. పల్లవరాజు అనుమతితో చైనా రాజు నాగపట్నం ఓడరేపులో బుద్ధుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. అంతేకాదు.. 1956లో ఈ ప్రాంతానికి దగ్గర్లోని కుళిప్పందళానికి నాటి చైనా అధ్యక్షుడు చౌ ఎన్ లై వచ్చారు. ఇంతకాలానికి మరో చైనా అధ్యక్షుడు ఈ ప్రాంతానికి రావటం విశేషం.