ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన మోడీ ఉత్త చేతులతో రావడంతో అన్ని వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. తన పర్యటనపై రాష్ట్ర బీజేపీ నుంచి వెంటనే ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్న మోడీకి ఆ విషయం అర్థమైంది. దీంతో నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్రానికి కేంద్రం కొన్ని వరాలు ప్రకటించింది.
అమరావతి శంకుస్థాపన వేదిక పై నుంచి ఎటువంటి హామీ ఇవ్వని ప్రధాని ఢిల్లీ వెళ్లిన తరువాత రాష్ట్రంపై ఒకింత కరుణ చూపారు. ఆంధ్రప్రదేశ్ లోని 26 పట్టణాలను అమృత్ పథకం కింద అభివృద్ధి చేయడానికి రూ.663 కోట్ల రూపాయలను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో నీటి సరఫరా కోసం 664 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఇక పార్కుల అభివృద్ధి కోసం రూ.17 కోట్లు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది.
కేంద్రం నిర్ణయంతో స్థానిక బీజేపీ నేతల ముఖాలు వెలిగిపోతున్నాయి. టీడీపీ నేతలూ సమాధానం చెప్పుకోగలుగుతున్నారు. ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు దక్కకపోయినా ఎంతో కొంత ప్రకటించడంతో తలెత్తుకోగలుగుతున్నమాని బీజేపీ - టీడీపీ నేతలు చెబుతున్నారు.