రివ‌ర్స్ గేర్ దీక్ష చేస్తానంటున్న మోడీ!

Update: 2018-04-06 17:03 GMT
మోతాదుకు మించిన ఒత్తిడి అంత‌కంత‌కూ పెరుగుతున్న‌ప్పుడు ఏమువుతుంది. బ‌ర‌స్ట్ అయిపోయిద్ది. ఎంత బ‌ల‌మైన‌దైనా బ‌ద్ధ‌లు కాక త‌ప్ప‌దు. ప్ర‌ధాని మోడీ ప‌రిస్థితి ఇంచుమించు ఇలానే ఉంది. నాలుగేళ్లుగా త‌న‌కు తిరుగు లేని ప‌రిస్థితి నుంచి వ్య‌తిరేక‌త అంత‌కంత‌కూ పెరుగుతున్న ప‌రిస్థితి.  మొన్న‌టి వ‌ర‌కూ మిత్రులుగా ఉన్నోళ్లు ఇప్పుడు నిర‌స‌న జెండా ఎగురు వేస్తున్నారు. విమ‌ర్శ‌ల క‌త్తి ప‌ట్టుకొని త‌న క్యారెక్ట‌ర్ ను చీల్చి చెండాడుతున్నారు.

ఇలాంటి వేళ‌లో కూడా తాపీగా.. పెద్ద మ‌నిషి మాదిరి మాట‌లు చెప్ప‌టం ఎంత మోడీకైనా క‌ష్ట‌మే. అందుకే.. త‌న తీరుకు భిన్నమైన వ్యాఖ్య‌ల్ని చేశారు మోడీ. గ‌డిచిన కొద్దిరోజులుగా పార్ల‌మెంటులో జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు నిర‌స‌న‌గా బీజేపీ ఎంపీలు రివ‌ర్స్ గేర్ లో తాము సైతం నిర‌స‌న చేస్తామ‌ని ప్రధాని ప్ర‌క‌టించారు. ఈ నెల 12న బీజేపీ ఎంపీలంతా నిరాహార‌దీక్ష చేప‌ట్టాల‌ని మోడీ పిలుపునిచ్చారు. ఎందుకీ నిర‌స‌న అంటే.. పార్ల‌మెంటులో స‌భ‌ను సాగ‌కుండా విప‌క్షాలు చేసినందుక‌ట‌.

ఒక‌వేళ విప‌క్షాలు హ‌ద్దులు మీరి విసిగిస్తున్న‌ప్పుడు వారి మీద వేటు వేయ‌టానికి స్పీక‌ర్ కు అధికారాలు ఉంటాయ‌న్న విష‌యం జ‌నానికి తెలీద‌ని అనుకుంటున్నారేమో? అయినా.. లోక్ స‌భ జ‌ర‌గ‌కుండా గొడ‌వ చేసినోళ్లు ఎంత‌మంది అంటే.. అన్నాడీఎంకే స‌భ్యులు మాత్ర‌మే. మొద‌ట్లో టీఆర్ఎస్ ఎంపీలు కొంద‌రు ఉన్నా.. త‌ర్వాత కామ్ అయిపోయారు.స‌భ‌లో 500 పైగా ఉండే ఎంపీల్లో ప‌ట్టుమ‌ని పాతిక‌మంది ఉండే ఎంపీల కోసం నిత్యం స‌భ‌ను వాయిదా వేయ‌టం వెనుకున్న ర‌హ‌స్యం ఎవ‌రికీ అర్థం కానిదేమీ కాదు. ఎక్క‌డ త‌న ప్ర‌భుత్వం మీద అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు వ‌స్తే.. ఆ సంద‌ర్భంగా చాలానే విష‌యాల‌కు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒక‌వేళ స‌మాధానం చెప్ప‌కున్నా.. స‌భ్యులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితి.

ఇది పార్టీకి ఇబ్బంది క‌లిగిస్తుంది కాబ‌ట్టే.. ఏ రోజుకు ఆ రోజూ స‌భ జ‌ర‌గ‌కుండా చేసిన మోడీ బ్యాచ్‌.. ఇప్పుడు అనూహ్యంగా స‌భ జ‌ర‌గ‌నిదానికి తామే రివ‌ర్స్ లో దీక్షలు చేయ‌టం ద్వారా.. స‌భ‌ను అడ్డుకుంటున్న వారిపై మోడీ బ్యాచ్ ఎంత ధ‌ర్మ‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌న్న క‌ల‌ర్ ఇచ్చుకోవ‌టానికి అవ‌కాశం ఉంటుంది. ఈ కార‌ణంతోనే  విప‌క్షాల వ్య‌వ‌హార‌శైలిపై పార్టీ ఎంపీల‌తో ఈ నెల‌లో పెద్ద ఎత్తున నిర‌స‌న చేయాల‌ని నిర్ణ‌యించారు మోడీ. అధికార‌ప‌క్షానికి చెందిన కీల‌క నేత ఇలా దీక్ష చేస్తామ‌ని చెప్ప‌టం చూస్తే.. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు రివ‌ర్స్ గేర్ లో షాకివ్వ‌టంలో మోడీ త‌ర్వాతే ఎవ‌రైనా అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. మోడీ తాజా ప్ర‌క‌ట‌న చూసిన త‌ర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
Tags:    

Similar News