నాలుగు నెలల క్రతం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైనంతనే మోడీషాలు మాత్రమే కాదు.. బీజేపీ నేతలు.. కార్యకర్తలే కాదు.. ఆ పార్టీని అభిమానించే వారు సైతం సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమా ఉన్నప్పటికీ ఇంత భారీ ల్యాండ్ స్కేప్ విజయాన్ని తమ సొంతం చేసుకుంటామని వారు కలలో కూడా ఊహించలేదని చెప్పాలి.
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నాలుగు నెలలకే వెల్లడైన ఉప ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ సీట్లు వచ్చినా.. ఫలితాల్ని చూసినప్పుడు మోడీషాలకు అంత పాజిటివ్ గా వాతావరణం లేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. గణాంకాల్ని చూసినప్పుడు ఉప ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా బీజేపీ నిలిచినా.. హర్యానాలో అధికారం చేజారటం.. ఉప ఎన్నికలు జరిగిన కొన్నిచోట్ల పార్టీకి వచ్చిన ఓట్లు ఆశాజనంగా లేవన్న మాట వినిపిస్తోంది. దీనికి నిలువెత్తు నిదర్శనంగా హుజూర్ నగర్ లో బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్ల లెక్క చూస్తే విషయం అర్థమవుతుంది.
సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు స్థానాల్ని సొంతం చేసుకున్న పార్టీకి ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ కు వచ్చిన ఓట్ల కంటే తక్కువగా రావటం తెలంగాణ కమలనాథులకు నిరాశను కలిగింది. 17 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 17 రాష్ట్రాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ కు 11 సీట్లు వచ్చాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎన్నికల విషయంలో అన్యమనస్కంగా వ్యవహరించినప్పటికి ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన సీట్లు తీసిపారేయలేమని చెప్పక తప్పదు.
రాష్ట్రాల వారీగా వివిధ పార్టీలకు వచ్చిన విజయాల్ని చూస్తే.. ఉత్తరప్రదేశ్ లో మొత్తం 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా బీజేపీ ఏడింటిలోనూ.. సమాజ్ వాదీ పార్టీ మూడు స్థానాల్లో.. అప్నాదళ్ ఒక స్థానంలో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన రాంపూర్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీని నిలువరించి మరీ ఆజాంఖాన్ తన సతీమణిని బరిలో దింపి మరీ గెలిపించుకున్నారు.
గుజరాత్ లో మొత్తం ఆరు స్థానాల్లో ఉప ఎన్నికలు జరగ్గా ఆ పార్టీని దిమ్మ తిరిగేలాంటి ఫలితాలు వచ్చాయి. బీజేపీకి కంచుకోటగా చెప్పే రాష్ట్రంలో బీజేపీ రెండింటిలోనే ఒక స్థానంలో అధిక్యతలో కొనసాగుతుండగా.. మూడు స్థానాల్లో కాంగ్రెస్ విజయాన్ని సాధించటం విశేషం. ఇప్పుడున్న జోరులో ఈ విషయం పెద్దగా ఫోకస్ కాలేదు కానీ.. గుజరాత్ లో బీజేపీకి వార్నింగ్ బెల్స్ మోగుతున్నట్లే. బిహార్ లోనూ ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి.
మొత్తం ఐదు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీ రెండు స్థానాల్లో.. మజ్లిస్ ఒక స్థానంలో గెలిచి రాష్ట్రంలో తన ఖాతాను తెరవగా.. జేడీయూ ఒక స్థానానికి పరిమితమైంది. స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. కేరళలో జరిగిన ఐదు స్థానాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రూపు యూడీఎఫ్ మూడు స్థానాల్లో విజయం సాధించగా.. కమ్యునిస్టుల కూటమి ఎల్ డీఎఫ్ కు రెండు స్థానాలు దక్కాయి. పంజాబ్ లో అధికార కాంగ్రెస్ తన అధిపత్యాన్ని నిరూపించుకుంది. మొత్తం నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ మూడింటిలోనూ.. అకాలీదళ్ ఒక స్థానంలోనూ విజయం సాధించింది.
అసోంలో నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే అధికార బీజేపీ మూడింటిలో విజయం సాధించగా.. ఎఐయూడీఎఫ్ ఒక స్థానంలో విజయం సాధించింది. ఇక సిక్కింలో మూడు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ రెండింటిలోనూ ఎస్ కేఎం ఒక స్థానంలో గెలిచింది.
తమిళనాడులోని రెండు స్థానాల్ని అధికార అన్నాడీఎంకే సొంతం చేసుకోవటం విశేషం. సార్వత్రిక ఎన్నికల్లో చతికిల పడిన అధికారపార్టీకి.. విపక్ష డీఎంకే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీట్లలో విజయం సాధించటం ఆసక్తికరమని చెప్పాలి.

హిమాచల్ ప్రదేశ్ లోని రెండు స్థానాల్లో ఎన్నికలు జరగ్గా బీజేపీ సొంతం చేసుకోవగా.. రాజస్థాన్ లో జరిగిన రెండు స్థానాల ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఒక స్థానంలో ఆర్ ఎల్ పీ మరో స్థానంలో విజయం సాధించింది. ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఒక స్థానంలో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక స్థానంలోనూ కాంగ్రెస్ గెలిచింది.
మేఘాలయలో ఒక స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో యూడీపీ సొంతం చేసుకోగా.. ఒడిశాలో జరిగిన ఉప ఎన్నికను అధికార బీజేపీ విజయాన్ని సొంతం చేసుకుంది. పాండిచ్చేరిలో జరిగిన ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణలో జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికను సిట్టింగ్ కాంగ్రెస్ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ సొంతం చేసుకుంది.