ఆ టెలికం కంపెనీలకు దేవుడిగా మారిన మోడీ సర్కార్

Update: 2019-11-21 06:59 GMT
మీ బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు చూసినా లక్ష రూపాయిలు ఉంటాయనుకోండి. మీరో పాతిక లక్షలు అప్పటికప్పుడు ఇవ్వాల్సి వచ్చిందనుకోండి. అప్పుడేం చేస్తారు? బెంబేలెత్తిపోతారు. అంత పెద్ద మొత్తాన్ని ఎలా తీర్చాలని తల పట్టుకుంటారు. అలాంటివేళ.. మీరు కట్టాల్సిన పాతిక లక్షలు ఇప్పడిప్పుడే కట్టక్కర్లేదు.. మరో ఐదేళ్ల తర్వాత ఇద్దరు కానీ అన్నారనుకోండి? మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది?

సేమ్ టు సేమ్ ఇప్పుడు దేశీయ టెలికాం కంపెనీల తీరు ఇలానే ఉంది. కేంద్ర ప్రభుత్వానికి రూ.1.47 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని టెలికం కంపెనీలు చెల్లించాల్సిన వేళ.. అలాంటిదే తప్పనిసరి అయితే.. కంపెనీలు దివాళ ఎత్తటం మినహా మరింకేమీ చేయలేరన్న వాదనలు వినిపిస్తున్న వేళ.. కేంద్రం తీసుకున్న నిర్ణయం టెలికం కంపెనీలకు కొత్త ఊరటను ఇచ్చిందని చెప్పక తప్పదు.

కేంద్రానికి బకాయిలుపడ్డ రూ.1.47 లక్షల కోట్ల మొత్తాన్ని మరో మూడేళ్ల వరకూ చెల్లించేలా వెసులుబాటు ఇస్తూ వాయిదా వేసింది. తాజాగా నిర్వహించిన కేబినెట్ భేటీలో ఈ నిర్నయాన్ని తీసుకున్నారు. ఆస్థిక అస్థిరత కారణంగా ఏ కంపెనీ మూత పడకూడదన్నదే తమ ప్రభుత్వ విధానంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నోట వెంట మాట వచ్చిన కొద్ది రోజులకే కేంద్ర కాబినెట్ తీసుకున్న తాజా నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

ఏ కంపెనీ మూత పడాలని తాము కోరుకోమని.. ప్రతి కంపెనీ డెవలప్ కావాలనే తాము కోరుకుంటామని మంత్రి వెల్లడించారు.  సుప్రీం తీర్పు టెలికాం సంస్థల్లో ఆందోళన ఎక్కువ కావటమే కాదు.. తమ సంస్థల్ని మూసివేయాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తమైంది. ఇలాంటి తరుణంలో కేంద్ర బకాయింపుల విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం కంపెనీలకు భారీ ఊరట ఇచ్చాయని చెప్పక తప్పుదు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో.. ఛార్జీల పెంపు నిర్ణయం తీవ్రంగా ఉండే అవకాశం ఉండదంటున్నారు. కేంద్రానికి చెల్లించాల్సిన బకాయిల్లో వోడాఫోన్ ముందుంటే.. ఎయిర్ టెల్.. జియోలు కూడా ఉన్నాయి. కేంద్ర కాబినెట్ తీసుకున్న తాజా నిర్ణయం ఆయా కంపెనీలు ఊపిరి పీల్చుకునే వీలుంటుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News