కేసీఆర్‌, జ‌గ‌న్ ప్ర‌భుత్వాల డ‌బ్బుతో మోడీ బిల్డ‌ప్‌!

Update: 2021-04-23 10:30 GMT
రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు క‌డుతున్న ప‌న్నుల‌తో..ఇక్క‌డి కేసీఆర్‌, జ‌గ‌న్ ప్ర‌భుత్వాలు ఇస్తున్న ద‌న్నుతో.. ముందుకు సాగుతున్న కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం భారీ ఎత్తున బిల్డ‌ప్ ఇస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనికి రీజ‌నేంటి?  అంటే.. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా క‌రోనా రెండో ద‌శ తీవ్రంగా ఉంది. ఈ క్ర‌మంలో.. ప్ర‌జ‌ల‌ను ఆదుకోవాల్సిన బాధ్య‌త‌, ముఖ్యంగా పేద‌ల ఆరోగ్యానికి గొడుగు ప‌ట్టాల్సిన క‌నీస ధ‌ర్మం.. ప్ర‌బుత్వాల‌పై ఉంది. బాగా ధ‌న వంతులే అయితే.. ఎవ‌రూ.. ప్ర‌భుత్వ సాయం లేకుండానే ముందుకు సాగుతారు.

కానీ, పేద‌లు మాత్రం ప్ర‌భుత్వాల సాయం ఆశిస్తారు. ఈ విష‌యంలో ఉదారంగా ముందుకు వ‌చ్చి.. కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల‌తో సంబంధం లేకుండా.. ప్ర‌జ‌లను ఆదుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. కానీ వ్యాక్సిన్ పంపిణీ.. విష‌యంలో మోడీ ప్ర‌భుత్వం ద్వంద్వ నీతిని అవ‌లంబిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల కులు. వ్యాక్సిన్‌ను బిహార్ ప్ర‌జ‌ల‌కు ఉచితంగా అందిస్తుంద‌ట‌!  కానీ .. రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రం ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు మీరు కొనిస్తే.. కొనిచ్చుకోండి.. లేకపోతే.. ప్ర‌జ‌ల‌నే కొనుక్కోమనండి.. అంటూ.. కేంద్రం `పెద్ద‌న్న స‌ల‌హా` ఒక‌టి పారేసింది!!

వాస్త‌వానికి కేంద్రం తీసుకువ‌చ్చిన వ‌స్తు, సేవ‌ల ప‌న్ను(జీఎస్టీ)కు కేసీఆర్‌, జ‌గ‌న్ ప్ర‌భుత్వాలు సై! అన్నా యి. ఇత‌ర రాష్ట్రాల ప్ర‌భుత్వాలు వ్య‌తిరేకించినా.. జ‌గ‌న్‌, కేసీఆర్‌.. ముందు చూపుతో దీనికి ఓకే చెప్పారు. దీనికి కార‌ణం.. ప్ర‌కృతి విప‌త్తులు వ‌చ్చిన‌ప్పుడు కేంద్రం త‌మ‌కు అండ‌గా ఉంటుంద‌ని.. త‌మ‌ను ఆదుకుంటుంద‌ని అనుకున్నారు.దీంతో ఇక్క‌డి ప్ర‌జ‌లు క‌డుతున్న ప‌న్నుల్లో జీఎస్టీ కింద కేంద్రానికి భారీ ఎత్తున కోట్లాది రూపాయ‌లు అందుతున్నాయి. అయితే.. ఇప్పుడు వ‌చ్చిన క‌రోనా విష‌యంలో వ్యాక్సిన్‌ను అందించేందుకు కేంద్రంలో మోడీ స‌ర్కారు మాత్రం ద్వంద్వ‌నీతిని ప్ర‌ద‌ర్శిస్తోంది.

బిహార్ వంటి అత్యంత అల్ప ప‌న్ను ఆదాయం ఉన్న రాష్ట్రాల‌కు ఉచితం ఇస్తామ‌ని.. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కొనుక్కోవాల్సిందేనని.. మోడీ ప్ర‌చారం చేస్తున్నారు. అంటే.. కేంద్రానికి క‌ట్టే ప‌న్నులు క‌డుతూనే ఉండాలి.. మ‌న అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు వ్యాక్సిన్ వంటి ప్రాణావ‌స‌ర మందుల‌ను కొనుగోలు చేసుకోవాలి. ఇదీ.. ఇప్పుడు మోడీ చెబుతున్న సూక్తి! పోనీ.. ఇంతా చేసి.. కొనుక్కుని వ్యాక్సిన్ తీసుకుంటే.. మోడీ సార్‌.. వీడియో కాన్ఫ‌రెన్స్‌లోకి వ‌చ్చేసి.. ``అంతా నాఘ‌న‌తే.. నేను లేక‌పోతే.. దేశం ఏమైపోయేదో!!`` అని పెద్ద ఎత్తున బిల్డ‌ప్ ఇచ్చుకుంటాడ‌ని అంటున్నారు మేధావులు. ఇదే విష‌యం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుండ‌డంగ‌మ‌నార్హం.
Tags:    

Similar News