ప్రధాని మోడీ రెండేళ్ల తర్వాత తన కేబినెట్ ను ప్రక్షాళన చేశాడు. సీనియర్లను, పనిచేయని వారిని పక్కనపెట్టి మరీ కొత్త వారికి అవకాశం కల్పించారు. ఈ ప్రక్షాళన తర్వాత కొత్త వారికి భారీగా అవకాశాలు ఇచ్చారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు పెద్దపీట వేశారు. మోడీ నేతృత్వంలోని కేంద్రమంత్రివర్గంలో 42శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తాజాగా ‘అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. దారుణం ఏంటంటే.. వీరిలో హత్యాయత్నం కేసుల్లో ఉన్న వారు సైతం నలుగురు ఉండడం విశేషం.
మోడీ కేబినెట్ విస్తరణలో ఈసారి భారీ మార్పులే జరిగాయి. కొత్తగా 36మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. దీంతో కేంద్రంలో మంత్రుల సంఖ్య 78కి పెరిగింది. నూతన మంత్రి మండలిలో 42శాతం అంటే 33 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయట.. వీరిలో 24మందిపై హత్య, హత్యాయత్నం, దోపిడీ లాంటి తీవ్రమైన నేర అభియోగాలు నమోదయ్యాయి.
ఎన్నికల సంఘంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ నివేదిక రూపొందించింది. 2019లో తొలి మంత్రివర్గంలో 56మంది మంత్రులుండగా.. వారిలో 39శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అప్పటితో పోలిస్తే ఈ సంఖ్య ఇప్పుడు మరింత పెరగడం గమనార్హం.
ఇక కొత్త మంత్రివర్గంలో 90శాతం అంటే 70 మంది మంత్రులు కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. మోడీ కేబినెట్ లోనే అత్యంత సంపన్న మంత్రి.. పౌర విమానయాన శాఖ నూతన మంత్రి జ్యోతిరాదిత్య సింధియానే. ఆయన ఆస్తుల విలువ ఏకంగా రూ.379 కోట్లకు పైనే.. ఇక ఈయన తర్వాత పీయూష్ గోయల్ (రూ.95 కోట్లు), నారాయణ్ రాణే( రూ.87 కోట్లు), రాజీవ్ చంద్రశేఖర్ (రూ.64 కోట్లు) అత్యంత సంపన్న మంత్రుల జాబితాలో ఉన్నారు.
ఇక మోడీ కేబినెట్ లో అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన కేంద్రమంత్రి ‘ప్రతిమా భౌమిక్’. త్రిపురకు చెందిన ఆమె మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.6 లక్షలు. పశ్చిమ బెంగాల్ కు చెందిన జాన్ బార్లాకు రూ.14 లక్షలు , రాజస్థాన్ కు చెందిన కైలాష్ చౌదరికి రూ.24 లక్షలు, ఒడిశాకు చెందిన బివ్వేశ్వర్ తుడుకు రూ.27 లక్షలుగా ఏడీఆర్ సర్వే పేర్కొంది.
ఇక కొత్త మంత్రుల్లో ఉన్నత విద్యావంతులే అధికంగా ఉన్నారు. 21మంది మంత్రులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 9 మంది మంత్రులు డాక్టరేట్ అందుకున్నారు. ఇక 17 మంది గ్రాడ్యుయేషన్, మరో 17మంది ప్రొఫెషనల్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. ముగ్గురు మంత్రులు పదోతరగతి పూర్తి చేశారు. మరో ఇద్దరు మంత్రులు 8వ తరగతి, ఏడుగురు ఇంటర్ చదివినట్లు ఏడీఆర్ సర్వే బయటపెట్టింది.
మే 2019లో ప్రధాని నరేంద్రమోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో కేబినెట్ ప్రక్షాళన చేయడం ఇదేప్రథమం. 43 మందిలో 15 మంది మంత్రులను కేంద్ర మంత్రివర్గంలో.. 28 మంది మంత్రులను రాష్ట్ర మంతులుగా చేర్చారు. ఇందులో 12 మంది సీనియర్లను కేంద్రమంత్రి పదవుల నుంచి మోడీ తొలగించారు.
కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్, న్యాయ, ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, విద్యాశాఖ మంత్రి రమేశ్ ఫోక్రియాల్, పర్యావరణ మంత్రి జవదేకర్ లు మోడీ క్యాబినెట్ నుంచి వైదొలిగారు.