ప్రదాని నరేంద్రమోడీ కేంద్రంలో పగ్గాలు చేపట్టి 9 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2014లో తొలిసారి అధికారం చేపట్టిన మోడీ 2019లోనూ విజయందక్కించుకున్నారు. దీంతో వరుసగా కేంద్రంలో రెండో సారి ప్రధానిగా ఆయన చక్రం తిప్పుతున్నారు.
ఈ క్రమంలో 9 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు.. అధికార పార్టీ పెద్దలు వచ్చే 9 నెలల కాలానికి సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అయితే.. ఈ 9 ఏళ్ల పాలన ఎలా ఉన్నప్పటికీ.. కీలకమైన సమస్యలు మాత్రం అపరిష్కృతంగా అలానే ఉండిపోయాయి.
దీంతో ప్రధాని నరేంద్ర మోడీ చుట్టూ ఆయా సమస్యలు గిరగిరా తిరుగుతున్నాయి. వీటిని వైఫల్యాలుగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రచారం చేయనుంది. సంబరాలకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించనట్టే ఈ నెల 25(గురువారం) నుంచి మోడీ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా కార్యక్రమాలు రెడీ చేసుకుంది. దీనికి కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ముందుకు సాగనుంది.
+ పెద్దనోట్ల రద్దుతో వచ్చిన తిప్పలు. 2016 నవంబరు 8న పాత రూ.500, రూ.1,000 నోట్లను తక్షణమే రద్దు చేశారు. తర్వాతి రోజు నుంచి దాదాపు రెండు నెలల పాటు దేశ వ్యాప్తంగా 140 కోట్ల మంది ప్రజలు కొత్త నోట్ల కోసం పరుగులు పెట్టారు. అస్వస్థతకు గురై బ్యాంకుల ముందు అనేక మంది మరణించారు. వ్యాపారాలు నిలిచిపోతున్నాయి.
+ 2019 పుల్వామాదాడి. శ్రీనగర్ లో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న కాన్వాయ్ పై ఉగ్రవాదులు కారుతో ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. దాదాపు 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. దీనిపైనే జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాలిక్ మాలిక్ ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. దీనిని ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ రెడీ అయింది.
+ కరోనా.. 2020, జనవరి 27న భారత్ లోకీ వ్యాప్తించింది. లాక్ డౌన్ తో భారత ఆర్థిక వ్యవస్థకు మళ్లీ నష్టం వచ్చింది. రోడ్లన్నీ నిర్మానుష్యం. కొనుగోళ్లు నిలిచిపోయాయి. అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. వలస కార్మికులు వేలాది కిలోమీటర్లు నడుచుకుంటూ సొంత ప్రాంతానికి వెళ్తూ పడిన కష్టాలు వర్ణనాతీతం. వీరిని ఆదుకోవడంలో మోడీ సర్కారు విఫలమైందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
+ చైనా-భారత్ మధ్య ఉన్న విభేదాలు 2020 మేలో తారస్థాయికి చేరాయి. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో భారత సైనికులతో పాటు చైనా సైనికులు చాలా మంది మృతి చెందారు. తూర్పు లద్దాఖ్‌లోని పాంగోంగ్ సరస్సు, వాస్తవాధీన రేఖ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు మోడీకి సెగపుట్టించాయి.
+ రాజధాని ఢిల్లీలో 2020, ఫిబ్రవరి 23 నుంచి దేశ జరిగిన అల్లర్లు సంచలనమయ్యాయి. మోడీ సర్కారుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పలు రాష్ట్రాల్లో 2018-19లో జరిగిన మూకదాడులు కేంద్ర సర్కారుకు చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి.
+ 3 సాగుచట్టాలు-2020కి వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళన ప్రపంచాన్నీ కదిలించింది. మోడీకి అప్పట్లో ఈ వ్యవహారం అతి పెద్ద సవాలుగా మారింది. చివరకు ఆ చట్టాలను కేంద్ర సర్కారు ఉపసంహరించుకుంది. 2021 అక్టోబరు 3న లఖింపూర్ ఖేరీలో రైతుల మీదకు కారు దూసుకెళ్లడం, కొందరు రైతులు చనిపోవడం సంచలనం రేపింది. ఇప్పుడు ఈ విషయాలను అంటే.. మోడీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి.