మౌనంగా ఉండటం కూడా కొన్నిసార్లు వ్యూహమే అవుతుంది. మోడీ లాంటి మాస్టర్ మైండ్ కొన్ని రోజులుగా కామ్ గా ఉన్నారంటే.. అది తుఫాను ముందు ఉండే ప్రశాంతం లాంటిదే. పౌరసత్వ సవరణ చట్టంపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయటం.. నిరసనలు తీవ్రతరం చేయటం తెలిసిందే. గడిచిన కొద్ది రోజులు గా సాగుతున్న ఈ వ్యవహారం పై ప్రధాని మోడీ నేరుగా మాట్లాడింది లేదు. ఆ మధ్యన కేంద్ర హోం మంత్రి అమిత్ షా లాంటి వారు మాట్లాడారే కానీ.. నిరసనలపై మోడీ మాష్టారు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేయలేదు.
చూసినంత కాలం చూసిన ప్రధాని మోడీ.. తాజాగా విపక్షాల పై విరుచుకు పడ్డారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై ఆయన విమర్శనాస్త్రాల్ని సంధించారు. తన వాదనల్లో తన అమ్ముల పొదిలో బలమైన జాతీయతను తెర మీదకు తీసుకొచ్చిన ఆయన.. దానికి సెంటిమెంట్ రంగరించారు. గడిచిన 70 ఏళ్లలో పాకిస్తాన్ లో మైనార్టీలపై జరుగుతున్న దాడుల గురించి ఎందుకు మాట్లాడటం లేదంటూ విపక్షాల గొంతుల్లో వెలక్కాయ పడే ప్రశ్నను సంధించారు.
పొరుగుదేశాల నంచి శరణార్థులు గా వలసొచ్చిన మైనార్టీల ను రక్షించటం.. వారికి మద్దతు గా నిలవటం భారత సాంస్కృతిక.. జాతీయ బాధ్యతగా అభివర్ణించారు. కర్ణాటక లోని సిద్దంగం మఠాన్ని సందర్శించిన వేళ మాట్లాడిన మోడీ.. పాక్ లోని మైనార్టీల వెతల్ని ప్రస్తావించటం ద్వారా.. దేశంలోని మెజార్టీల మనసుల్నిటచ్ చేసేలా మాట్లాడారు. అదే సమయంలో.. విపక్షాల తీరును తప్పు పట్టటం ద్వారా.. వారిని డిఫెన్స్ లోపడేశారని చెప్పక తప్పదు.
పార్లమెంటు చేసిన చట్టాల్ని వ్యతిరేకిస్తున్న వారు నిజంగా మాట్లాడాలనుకుంటే పాకిస్తాన్ దుర్మార్గాలను అంతర్జాతీయ వేదికల మీద ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘మీకు నిజంగానే దమ్ముంటే.. నిజంగానే నిరసన తెలపాలనుకుంటే గడిచిన 70 ఏళ్లుగా పాక్ చేస్తున్న దుర్మార్గాలపై గొంతు విప్పండి. పాక్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలపండి. ర్యాలీలు చేయాలనుకుంటే పాక్ లో అణిచివేతకు గురై శరణార్థులుగా ఇండియా కు వచ్చిన దళితులకు మద్దుతుగా ర్యాలీలు తీయండి. రోడ్ల మీద ధర్నాలు చేయాలంటే పాక్ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేయండి’’ అంటూ విపక్షాల దూకుడు కు కళ్లాలు వేసే ప్రయత్నం చేశారు.
పాక్ మత ప్రాతిపదికన ఏర్పడిన దేశమని.. భారత్ మతాల పేరు తో విభజింప బడిన దేశమన్న విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. దేశ విభజన సమయం నుంచి పాక్ లో మైనార్టీల మీద దాడులు కొనసాగుతున్నాయని.. అది హిందూ అయినా సిక్కు అయినా జైన.. క్రిస్టియన్ అయినా. ఏ మైనార్టీ అయినా సరే పాక్ లో దాడులకు.. వివక్షకు గురి అవుతున్నారన్నారు.
‘‘అలాంటి వాటిపై ఎందుకు మాట్లాడరు. పాక్ లో తీవ్ర అణచివేతకు.. దాడులకు గురయ్యారు కాబట్టే.. అక్కడి మైనార్టీలు భారత్ కు వలస వచ్చారు. అలాంటి వారిని అక్కున చేర్చుకుంటామంటే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. పాక్ దుర్మార్గాల మీద నోరు విప్పని వీరు.. భారత్ లో తల దాచుకుంటున్న శరణార్తులకు వ్యతిరేకంగా మాత్రం నిరసనలు చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. కాస్త ఆలస్యంగా అయినా.. తన వాదనను వినిపించిన ప్రధాని మోడీ మాటలకు విపక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.