మాటలతో మంట పుట్టించే టీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మిగిలిన రాజకీయ పార్టీ అధినేతలకు చాలానే తేడా ఉంది. ఉద్యమ నేతగా పేరున్న ఆయన.. తన మాటలతోనే కోట్లాది మంది కదిలించారు కానీ.. తనకు తాను మాత్రం రోడ్ల మీదకు వచ్చింది లేదు.
అంత పెద్ద ఉద్యమంలోనూ కేసీఆర్ రోడ్ల మీదకు వచ్చి.. నిరసన నిర్వహించటం.. ధర్నా చేపట్టటం లాంటివి చాలా చాలా తక్కువగా.. వేళ్ల మీద లెక్కించే సార్లు మాత్రమే జరిగాయని చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో మర్చిపోలేని ఎన్నో ఆందోళనలకు లక్షలాది మంది కదిలి వచ్చినా.. కేసీఆర్ మాత్రం రోడ్ల మీదకు వచ్చే వారు కాదు.
ఇలా దశాబ్దాల నాటి కలను సాకారం చేసుకునే విషయంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహం అందరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేసిందని చెప్పాలి. అలాంటి కేసీఆర్.. చేతిలో అధికారంలో ఉన్న వేళ.. తెలంగాణలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తున్న సందర్భంలో.. ఒక ఇష్యూలో ఆయన తనకు తానుగా రోడ్డు మీదకు వచ్చి.. ధర్నాకు కూర్చునే ప్రత్యేక సందర్భం తాజాగా చోటు చేసుకోనుందని చెప్పాలి.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారుకు.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మాట తీరులో ఉన్న తేడాను ఎత్తి చూపుతూ వారి తీరును ఎండగడుతూ ధర్నా చౌక్ లో దాదాపు మూడు గంటల పాటు ధర్నాలో పాల్గొనేందుకు వస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ ఉద్యమ సమయంలోనే బయటకు రాని ఆయన.. అందుకు భిన్నంగా అధికారంలో ఉన్న వేళ రోడ్డు మీదకు వచ్చి ఆందోళన నిర్వహించే పరిస్థితి ఏర్పడిందంటే.. ఆ క్రెడిట్ కేంద్రంలోని మోడీ సర్కారుకే చెల్లుతుందని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని అడిగినా.. ఇప్పటివరకు కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదని మండిపడుతున్న కేసీఆర్.. కేంద్రం తీరును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేలా చేయటం కోసమన్నట్లుగా ఆయన ధర్నా చౌక్ కు అడుగు పెట్టనున్నారు.
తెలంగాణ ఉద్యమ వేళలోనూ కనిపించని సీన్.. తాను సాధించిన తెలంగాణ రాష్ట్రంలో.. ధర్నా చౌక్ వద్దకు వచ్చి మరీ నిరసనను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడటం ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా చెబుతున్నారు. ఇదంతా చూసినప్పుడు.. కేసీఆర్ ను ధర్నా చౌక్ వద్దకు వచ్చేలా చేయటంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు చేతకాలేదు కానీ.. మౌనంగా ఉంటూనే తాను అనుకున్నది అనుకున్నట్లు చేసే మోడీ మాష్టారికే కేసీఆర్ ను ధర్నా చౌక్ లో కూర్చొబెట్టిన ఘనత దక్కుతుందంటున్నారు. మరి.. తనను ధర్నా చౌక్ కు వచ్చేలా చేసిన మోడీ విషయంలో గులాబీ బాస్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.