దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాలు.. ముఖ్యంగా దాయాది దేశం పాకిస్థాన్ కూడా ఇప్పుడు భారత్ వైపు నిశితంగా అత్యంత ఉత్కంఠగా చూస్తున్నాయి. మోడీ సర్కారు తీసుకునే నిర్ణయం ఏంటి? ఏ దిశగా అడుగులు వేస్తారు? ఎలాంటి సంచలనాల దిశగా పరుగులు పెడతారు? అని ఆలోచన చేస్తున్నాయి. దీనికి కారణం.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ పరిధిలో తాము ఉండబోమని.. భారత్‌లో కలిపేసుకోవాలని.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రజలు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తుండడమే!
నిజానికి పీవోకే సమస్య 75 సంవత్సరాలుగా భారత్-పాకిస్థాన్ దేశాలను అట్టుడికిస్తోంది. దేశాల మధ్య వైరాన్ని పెంచేసింది. చీటికీ మాటికీ యుద్ధ వ్యాఖ్యలు చేసుకునేలా చేస్తోంది. అలాంటి పీవోకేలో ఇప్పుడు భారత నినాదాలు పెల్లుబుకుతున్నాయి. దీనికి కారణం.. పాకిస్థానం కనీసం ఇక్కడి ప్రజలకు తిండి గింజలుకాదు కదా.. పిడికెడు జొన్న పిండిని కూడా పంచే పరిస్థితిలో లేకపోవడమే.
తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న పాకిస్థాన్ గత నెల రోజులుగా పీవోకే లో పరిస్థితిని గాలికి వదిలేసింది. దీంతో ఇక్కడి గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంతవాసులు భగ్గుమంటున్నారు. దశాబ్దాలుగా తమ ప్రాంతాలను దోచుకుంటున్న పాక్ సర్కారు దమననీతిపై మండిపడుతున్నారు. తమను భారత్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మోడీ అనుకూల నినాదాలు, భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
కార్గిల్ రోడ్డును తిరిగి తెరవాలని, భారత్‌లో కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో తమ ప్రాంతాన్ని కలిపేయాలని వారు అడుగుతున్నారు. ఆ ప్రాంతంలో 12 రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. గోధుమ, ఇతర నిత్యావసర వస్తువులపై సబ్సిడీల పునరుద్ధరించాలని, ఈ ప్రాంతంలోని సహజవనరుల దోపిడీ, భూముల ఆక్రమణను ఆపాలని వారు నినదించారు.
ఈ క్రమంలో మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అది పాకిస్థాన్‌కు చెంప పెట్టుగానే ఉండనుంది. అంతేకాదు.. దేశంలోనూ.. మోడీ ప్రభంజనం మరింత పెరుగుతుందనే లెక్కలు వేసుకుంటున్నారు. ఇదిలావుంటే.. ఈ పరిస్థితులను , పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ఢిల్లీ పెద్దలు మరికొద్ది రోజులు వేచి చూసి.. అంతర్జాతీయ సమాజం మరింత దిగి వచ్చే వరకు ఆగేలా ఉన్నట్టు కనిపిస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.